27నుంచి స్టాలిన్ భారీ షెడ్యూల్
చిరంజీవి స్టాలిన్ చివరి షెడ్యూల్ షూటింగ్ ఈనెల 27నుంచి జూన్ 25 వరకు హైదరాబాద్‌లో నిరవధికంగా జరుగనుంది. మిగిలిన రెండు పాటలను జులైలో చిత్రీకరిస్తారు. చిరంజీవి, త్రిషలపై ఈనెల 10 నుంచి 19 వరకు యూరప్‌లో రెండు పాటలను రాజు సుందరం నృత్యదర్శకత్వంలో చిత్రీకరించారు. స్టాలిన్‌ను చిరంజీవి జన్మదినమైన అగస్టు 22న విడుదల చేయాలని నిర్మాత నాగబాబు ఆలోచిస్తున్నారు. సామాజికస్పృహ, సృజనాత్మకత అధికంగా ఉన్న ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నందు వల్ల ఈ సినిమాపై చిరు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. చిరంజీవి ఇటీవలి చిత్రాలు అందరివాడు, జై చిరంజీవ సినిమాలు యావరేజిగా మిగిలిపోవడంతో ఆయన అభిమానులు ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. స్టాలిన్‌కు మణిశర్మ అందించిన సంగీతం కుర్రకారును ఊగించేలా ఉందని యూనిట్ వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications