తోబ్లాలో తొలి భారతీయ సినిమా స్టాలిన్
ఇటలీలోని తోబ్లా కొండల్లో ఇటీవల స్టాలిన్ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. అక్కడ చిరంజీవి-త్రిషల మీద ఒక పాటను చిత్రీకరించారు. తోబ్లా గ్రామంలో ఉష్ణోగ్రత మైనస్ పది డిగ్రీలు ఉండడంతో మన హీరో హీరోయిన్లు అనేక పాట్లు పడవలసి వచ్చింది. కొండల పైభాగంలోకి వెళ్ళడానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవలసి వచ్చింది. ఈ కొండల్లో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా స్టాలిన్. ఈ సినిమా షూటింగ్‌ను జులై మొదటి వారంలో పూర్తి చేసి, జులైలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయనున్నారు. చిరంజీవి పుట్టినరోజు అయిన ఆగస్టు 22న ఆడియోను విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వరపరిచిన పాటలు బాగున్నాయని ఇప్పటికే పేరు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూలును చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార ఐటం సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయం ఇంకా అధికారికంగా ధృవపడలేదు. దర్శకుడు మురుగదాస్ ఆమెను ఒప్పించడానికి ఇంకా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. స్టాలిన్ సెప్టెంబర్ 20న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











