స్నేహా ఉల్లాల్ ని వేధిస్తున్నాడు..పోలీస్ కంప్లైంట్

By Srikanya

ముంబై: స్నేహా ఉల్లాల్ కు వేషాలు లేకపోయినా సెలబ్రెటీగా తలనొప్పులు మాత్రం తప్పేటట్లు కనపడటం లేదు. ఆ మధ్య.న శృతి హాసన్ కి జరిగినటువంటి సంఘటనే స్నేహా ఉల్లాల్ కి రీసెంట్ గా జరిగంది. ఎవరో ఓ వ్యక్తి ముంబై బంద్రాలో ఉంటున్న ఆమె ఇంట్లోకి శనివారం లోపలకి రావటానిక ప్రయత్నించాడట. సెక్యూరిటీ గార్డ్, చుట్టుప్రక్కల వాళ్లు కలిసి అతనిక బుద్ది చెప్పారట. ఆ తర్వాత లోకల్ పోలీస్ లు ఎంటరవటంతో వారికి అప్పచెప్పారు. ఆ వచ్చిన అపరిచితుడు...వెర్షన్ ఏమిటంటే..తనను స్నేహ ఉల్లాల్ స్వయంగా రమ్మని చెప్పిందని, ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అందని పోలీసులకు చెప్పాడుట.

తర్వాత స్నేహ ఉల్ాల్ మాట్లాడుతూ... వినాయిక చవితి తర్వాత ఎవరో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను మీ అభిమానిని అనేవాడు. తర్వాత మిమ్నల్ని కలవాలి అనేవాడు.,మా నానమ్మను కూడా తీసుకువస్తాను అనేవాడు. తర్వాత తరచూ ఫోన్స్ చేయటం మొదలెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత తనను కలవకపోతే చంపేస్తానని ఫోన్ చేయటం మొదలెట్టాడు.

Stalker plots Sneha Ullal's Murder

తర్వాత నెంబర్ బ్లాక్ చేసాను. అయితే వేరే వేరే నెంబర్ల నుంచి ఫోను చేసేవాడు. ఇప్పుడేమో నా ఇంటికే వచ్చేసాడు. చాలా తక్కువ మందికి మా ఇంటి ఎండ్రస్ తెలుసు. అది కూడా తెలుసుకుని వచ్చేసాడు. దాంతో నేను షాక్ అయ్యాను. ఇప్పుడు పోలీసులు పట్టుకెళ్ళారు. రిలీఫ్ గా ఉంది. దాదాపు నెల నుంచి బయిటకు రావటానికి కూడా భయపడుతున్నాను. ఈ టెన్షన్ నుంచి నేను తేరు కోవటానికి ఎంత కాలం పడుతుందో అంది.

అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.

సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X