బద్రీనాథ్ జోష్, హైదరాబాదులో తోపులాటలో ఇద్దరికి గాయాలు
అల్లు అర్జున్ నటించిన బద్రీనాథ్ సినిమాపై అభిమానుల జోష్ ఇంతింత అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. హైదరాబాదులోని మల్కాజిగిరి సాయిరాం థియేటర్‌కు సినిమా చూసేందుకు పెద్ద యెత్తున అభిమానులు వచ్చారు. ఈ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. కొంత మంది అభిమానులు గోడ దూకడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారికి కరెంట్ తీగలు తగిలాయి. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
థియేటర్ ప్రధాన గేట్లు తెరవకపోవడంతో అభిమానుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతోనే లోనికి ప్రవేశించడానికి కొద్ది మంది గోడ దూకడానికి ప్రయత్నించారు. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలని అంటున్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇది సంభవించిందని ఆరోపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











