గుంటూరు కారం ఈవెంట్‌లో ఊహించని ప్రమాదం.. పోలీసులు, ఫ్యాన్స్‌కు తీవ్ర గాయాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సీజన్‌కు ఉన్న ప్రత్యేకత గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా ఈ పండుగకు వచ్చే సినిమాలు సందడి చేస్తుంటాయి. అందుకే పొంగల్‌ సీజన్‌లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అలా ఈ ఏడాది కూడా టాలీవుడ్‌ నుంచి భారీ చిత్రాలు వస్తున్నాయి.

అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ ఒకటి. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఇందులో ఊహించని ప్రమాదం జరిగింది. దీంతో చాలా మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే....

Stampede at Guntur Karam pre release event.. Fans and Police Was Injured

గుంటూరు కారంతో మహేశ్: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మూవీనే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేశారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Stampede at Guntur Karam pre release event.. Fans and Police Was Injured

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్: 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌, ట్రైలర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ హడావిడి ఓ రేంజ్‌లో కనిపిస్తుంది. అలాగే, బుకింగ్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి.

Stampede at Guntur Karam pre release event.. Fans and Police Was Injured

గ్రాండ్‌గా మూవీ ఈవెంట్: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గుంటూరులో నిర్వహించారు. ఓపెన్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫంక్షన్ ఎంతో సందడిగా సాగింది. దీనికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.

ఈవెంట్‌లో తొక్కిసలాట: అంగరంగ వైభవంగా జరిగిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాటలు, డ్యాన్స్ పెర్పార్మెన్స్‌లతో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, శ్రీలీల, మీనాక్షి చౌదరి సహా పలువురు ప్రముఖులు తమదైన రీతిలో మాట్లాడి ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. అంతా మంచిగా సాగింది అనుకున్నప్పుడే ఈ ఈవెంట్‌లో తొక్కిసలాట కూడా జరిగింది.

Stampede at Guntur Karam pre release event.. Fans and Police Was Injured

పోలీసులు లాఠీచార్జ్ చేసి: 'గుంటూరు కారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఓపెన్ గ్రౌండ్‌లో నిర్వహించారు. దీనికి పరిమితికి మించి అభిమానులు హాజరయ్యారు. అదే సమయంలో మరికొందరు స్టేజ్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా అభిమానుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగింది. దీంతో వాళ్లను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేసినట్లు తెలిసింది.

Stampede at Guntur Karam pre release event.. Fans and Police Was Injured

వాళ్లందరికీ గాయాలు: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొక్కిసలాట కారణంగా చాలా మంది అభిమానులు, పోలీసులు గాయపడ్డారు. వారిలో కొందరు తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యారు. కొందరి అయితే పోలీసులు సిబ్బంది సీపీఆర్ కూడా చేసినట్లు తెలిసింది. అలాగే, గాయపడిన వాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X