నా మనసులో ఆ కోరిక .. అడగాలంటే అలాంటి ఇగో.. బ్రహ్మనందం ఎమోషనల్

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం కీడా కోలా. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, చైతన్య రావు, తరుణ్ భాస్కర్, రాగ్ మయూర్, రఘురామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 3వ తేదీన థియేటర్లలోకి రిలీజ్ అవుతున్నది. వివేక్ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ తదితరులు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రానా దగ్గుబాటి తమ సొంత బ్యానర్ సురేష్ పొడక్షన్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మనందం మాట్లాడుతూ..

తరుణ్ భాస్కర్ మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను మెప్పించడానికి ఇంత కస్టపడాలా? అనేది నాకు అర్దమైంది. ప్రేక్షకులను నవ్వించడానికి లాజికల్‌గా ఆలోచించాల్సి ఉంటుంది అని బ్రహ్మనందం అన్నారు. నేను చాలా తక్కువగా సినిమాలు చేస్తుంటాను. కానీ కీడాకోలా సినిమాలో నటించడానికి ప్రధాన కారణం దర్శకుడు తరుణ్ భాస్కర్ అని అన్నారు.

Star Comedian Brahmanandam emotional Speech at Keeda Cola pre Release event

తరుణ్ భాస్కర్ చేసిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూశాను. ఇలాంటి డైరెక్టర్ల వద్ద పనిచేయాలనే కోరిక కలిగింది. కానీ వారికి ఫోన్ చేసి.. మీ సినిమాల్లో నటించాలని ఉందని అడగాలంటే ఇగో అడ్డు వస్తుంది. వాళ్లు వచ్చి అడిగితే నటించాలనే కోరిక మనసులో ఉంటుంది. అయితే భగవంతుడి దయవల్ల తరుణ్ భాస్కర్ వచ్చి మా సినిమాలో నటించాలని అడిగారు. దాంతో నేను ఫుల్ హ్యాప్పీ అయ్యాను అని బ్రహ్మనందం తెలిపారు.

కీడా కోలా సినిమాలో నటించడం వల్ల ఓ రకమైన అనుభూతి కలిగింది. ఈ సినిమా టీమ్ నాకు ఇచ్చిన గౌరవం హృదయాన్ని టచ్ చేసింది. ఓ పెద్దలా, ముఖ్యంగా తండ్రిలా చూసుకొన్నారు. వారు చూపించిన ప్రేమకు తలవంచి నమస్కరిస్తున్నాను. రవీంద్ర, రఘురామ్, రాజ్ మజూర్, చైతన్య రావు, జీవన్‌, విష్ణుతో నటించడం హ్యాపీగా ఉంది. నేను కూడా చిన్న పిల్లాడిలా నటించే అవకాశం కలిగింది అని బ్రహ్మనందం అన్నారు.

Star Comedian Brahmanandam emotional Speech at Keeda Cola pre Release event

కీడా కోలా సినిమా విషయానికి వస్తే.. ఇలాంటి ఆలోచనలు తరుణ్ భాస్కర్‌కు ఎందుకు వస్తాయో తెలియదు. నన్ను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి ఎలా కామెడీ చేయించాలని అనుకొన్నాడు. యూరిన్ ప్యాకెట్ పక్కన పెట్టి.. కొత్త ఆలోచనలతో కామెడీ క్రియేట్ చేయాలనే ప్రతిభ ఉన్న దర్శకుడు తరుణ్ భాస్కర్. స్నేహితులను నిర్మాతలుగా చేసుకొని ఎలాగైనా నవ్వించాలనే ప్రయత్నం చేసిన విధానం నన్ను ఆకట్టుకొన్నది అని బ్రహ్మనందం చెప్పారు.

కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇంటికి వచ్చి చర్చించుకొంటాం. కానీ కామెడీ సినిమాల విషయానికి వస్తే.. థియేటర్‌లోనే ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాలి. అలాంటి పనిని తరుణ్ భాస్కర్ చేశాడు. కామెడీ పండించడానికి నటీనటులు చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో నటించినప్పుడు జంధ్యాల సినిమాలో నటించిన అనుభూతి కలిగింది అని బ్రహ్మనందం అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X