గాసిప్స్ ని కలిసి ఎంజాయ్ చేస్తున్న రెండు ప్రేమ పక్షులు..!?

By Sindhu

వెండితెరపై ఆకట్టుకున్న అనేకానేక ప్రేమకథలను మించి తెరవెనుక ప్రభుదేవా-నయనతార లవ్‌ స్టోరీ గత రెండు మూడేళ్లుగా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి రోజుకో ఆసక్తి కరమైన కథనం. అసలు వీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు... ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు... తన భార్య రమాలత్‌ కు ప్రభుదేవా విడాకులు ఇవ్వడం... ఇత్యాది అంశాలతో ఎప్పటికప్పుడు వీరి టాపిక్ హాట్ హాట్‌గానే నడిచింది.

మా గురించి ఉన్నవీ లేనివీ కల్పించి రాసేస్తున్నారు, మొర్రో అంటూ కొందరు గగ్గోలు పెడుతుంటే, ఏం రాసుకుంటారో రాసుకోండి మాకేం పట్టింపుల్లేవ్ అని కొందరు బిందాస్ గా కూర్చుని తమపై వచ్చిన పుకార్లని వింటూ, చదవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పుకార్లని మొదట్నుంచి పట్టించుకోని వారిలో ముందుండే నయనతార ఇప్పుడు సినిమాలు మానేసి, ప్రభుదేవాతో పెళ్లికి సిద్దపడుతున్నా కానీ ఆమెని పుకార్లు వెంటాడ్డం మానలేదు. ఈ మధ్యే ప్రభు, నయనల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వారు పెళ్లి చేసుకోవడం లేదని ఓ పుకారు పుట్టింది.

టీవీ ఛానెల్స్ పుట్టించిన ఈ గాసిప్ తర్వాత వెబ్ సైట్లకి ఎక్కింది. ఇదంతా చూసిన నయన, ప్రభు కలిసి వాటిని ఎంజాయ్ చేశారట. ఎవరి వ్యాపారం వారిదని, అలాంటి పుకార్లు లేకపోతే వారికి ప్రయోజనం చేకూరదని అంచేత దాని గురించి గొడవ చేసి పనులు మనుకోలేమని వారు చెప్పారు. అంతా ఇలాంటి వాళ్లే అయితే అంతటా గాసిప్సే తప్ప ఎలాంటి కేసులూ ఉండవు కదూ..!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X