మహేష్ బాబు-ప్రభాస్ తరహాలో డైరెక్టర్ కొడుకు
టాలీవుడ్ రాకింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు మాస్టర్ ఆకాష్...మున్ముందు మహేష్ బాబు, ప్రభాస్ మాదిరి టాలీవుడ్ లో ఓ ఊపు ఊపుతానంటున్నాడు. ఈ ఇద్దరు హీరోలు అంటే తనకు చాలా ఇష్టం అని చెబుతున్నాడు ఆకాష్. ప్రస్తుతం ఆకాష్ నటించిన లోటస్ పాండ్ అనే చిత్రం అతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితం అవుతోంది. ఈ బుడ్డోడు ఇప్పటి నుంచే నటన, డాన్స్, మర్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.
అంతటితో ఆగకుండా తన తండ్రి దర్శకత్వం వహించే సినిమా షూటింగులు దగ్గర నుంచి పరిశీలిస్తూ మంచి యాక్టర్ కాడానికి కావాల్సిన లక్షణాలను మెల్లి మెల్లిగా నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఆకాష్ ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ధోనీ చిత్రంలో నటిస్తున్నాడు.
పూరీ కూడా ఆకాష్ ను తన పేరు నిలబెట్టే నటుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. మెగాస్టార్ తన కొడుకు రామ్ చరణ్ ను ఏ విధంగా తీర్చి దిద్దాడో...అదే మాదిరి ఆకాష్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించునేందుకు మరి కొన్న సంవత్సరాల్లో ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











