For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎవరా స్టార్ హీరో?: కత్తి-పవన్ ఫ్యాన్స్ మధ్య అతనే 'కీ' రోల్?, అసలేం జరిగింది?

  |

  దాదాపు నాలుగు నెలలకు పైగా ఒకరకమైన క్యురియాసిటీని, అదే సమయంలో విసుగూ పుట్టించిన పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి వ్యవహారం సద్దుమణగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పటిదాకా ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించిన ఇరువురు.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి కెమెరాల ముందు చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చారు. ఆ నవ్వుల వెనుక మర్మం ఏంటన్నదే ఇప్పుడు ఎవరికీ అంతు పట్టని విషయం..

  'కత్తి' వివాదం సుఖాంతం.. పవన్ ఫ్యాన్స్-కత్తి మహీష్ సెల్ఫీ..!

  డబ్బిచ్చారా? భయపెట్టారా? పవన్ ఫ్యాన్స్‌తో కాంప్రమైజ్ వెనక ఏమిటి?..... ఇదీ కత్తి సమాధానం!

  అనూహ్యం: సెల్ఫీతో 'కత్తి' వివాదం సుఖాంతం, ఫైనల్ స్టేట్‌మెంట్ ఇదే!, తెర వెనుక ఏం జరిగింది?

   జోక్యం చేసుకోవడానికే భయపడ్డారు:

  జోక్యం చేసుకోవడానికే భయపడ్డారు:

  ఒకానొక దశలో కత్తి-పవన్ ఫ్యాన్స్ విషయంలో జోక్యం చేసుకోవడానికే చాలామంది తటపటాయించారు. వివాదంలోకి ఎంటరైతే అనవసరంగా తామెక్కడ బుక్కయిపోతామేమోనని చాలామంది వెనుకంజ వేశారు. రచయిత కోన వెంకట్ కాస్త చొరవ చూపించినా.. జనవరి 15 డెడ్ లైన్ తర్వాత ఆయన కూడా చేతులెత్తేశారు.

   నమ్మశక్యంగా లేదు..:

  నమ్మశక్యంగా లేదు..:

  ఇక ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించడం ఎవరివల్ల కాదని చాలామంది ఫిక్స్ అయిపోయారు. గంటల తరబడి టీవి చానెళ్లు డిబేట్లు నిర్వహిస్తూనే ఉంటాయి తప్ప దీనికో అంతూ పొంతూ ఉండదని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మహేష్ కత్తి మెత్తబడటం చాలామందికి నమ్మశక్యంగా అనిపించలేదు.

  ఎవరా స్టార్ హీరో?:

  ఎవరా స్టార్ హీరో?:

  మహేష్ కత్తి-పవన్ ఫ్యాన్స్ వివాదం సద్దుమణగడం వెనుక ఓ స్టార్ హీరో ప్రమేయం ఉందన్న ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తూ వచ్చిన ఆయన.. ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే.. అటు పవన్ కల్యాణ్ కు ఇటు మహేష్ కత్తికి బిగ్ డ్యామేజ్ తప్పదని భావించారట. ఇందుకోసం ఆయనే నేరుగా కల్పించుకుని వివాదాన్ని పరిష్కరించే చొరవ చూపించినట్లు సమాచారం.

   మంత్రి సహాయంతో:

  మంత్రి సహాయంతో:

  ఓ స్టార్ హీరో ప్రమేయంతోనే వివాదం సద్దమణిగిందని చెబుతున్నప్పటికీ.. ఎవరా స్టార్ హీరో? అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఏపీలోని ఓ కీలక మంత్రితో మంతనాల ద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టించేలా ఆయన పావులు కదిపారట. ఆఖరికి సదరు మంత్రి గారి సూచన మేరకు అంతా కలిసి కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకున్నారని టాక్.

   వాళ్లలోనూ అనుమానాలు:

  వాళ్లలోనూ అనుమానాలు:

  మహేష్ కత్తి అనూహ్యంగా వెనక్కి తగ్గడంపై ఆయన మద్దతుదారుల్లోనూ పలు రకాల అనుమానాలు మొదలయ్యాయి. కత్తికి డబ్బు ముట్టిందా? లేక సామ దాన భేద దండోపాయాలన్ని ప్రయోగించి ఆయన్ను సైలెంట్ అయ్యేలా చేశారా? అన్న చర్చ జరుగుతోంది.ఇక.. ఒక్కడూ ఇంకెంతని పోరాడుతాడనేవారు లేకపోలేదు.

   ఏంటో ఆ మర్మం?:

  ఏంటో ఆ మర్మం?:

  మొత్తానికి ఓ పెద్ద వివాదానికి ఫుల్ స్టాప్ పడటం ఇరు వర్గాలకు బిగ్ రిలీఫే అయినప్పటికీ.. దీన్ని నిశితంగా ఫాలో అవుతూ వచ్చినవారు మాత్రం జుట్టు పీక్కునే పరిస్థితి. ఇంత వివాదాన్ని గంటల వ్యవధిలో పరిష్కరించుకున్నవారు.. ఇంతకాలం ఎందుకు సాగదీస్తూ వచ్చారని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం సద్దుమణగడం వెనుక అసలు మర్మం ఏంటనేది వాళ్లు బయటపెడితే తప్ప బయటకు వచ్చేది లేదు.

  English summary
  A speculation widely spreading in film circles that a star Hero involved in Pawan Kalyan fans vs Mahesh Kathi issue, due to his suggestions only issue was closed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X