శ్రీలంక క్రికెటర్ బయోపిక్‌లో ప్రముఖ హీరో.. స్పందించిన లెజెండ్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల శకం నడుస్తోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాక దేశంలోని ప్రతీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడానికి ఫిల్మ్ మేకర్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దేశంలో ఉన్న గొప్పవాళ్లందరి పేర్లను పరిశీలిస్తున్నారు. వారి చరిత్రలను తిరగేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు మన వాళ్లు ఇక్కడి రియల్ హీరోలవే బయోపిక్‌లు చేశారు. కానీ, తొలిసారి వేరే దేశానికి చెందిన ఓ లెజెండ్ జీవిత చరిత్రను సినిమాగా మలచబోతున్నారు.

ఇంతకీ ఆయనెవరనేగా మీ సందేహం..? ఆయన మరెవరో కాదు శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్. అవును.. ఈయన బయోపిక్ తీయడానికి కోలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కథా పరమైన చర్చలు కూడా ముగిశాయి. కొంత స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత దీనిని పట్టాలెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి.. మురళీధరన్‌గా కనిపించనున్నాడు. ఈ మేరకు ఆయన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ఈ సినిమాను శ్రీపతి తెరకెక్కించనున్నాడు.

 star hero play Muttiah Muralitharan in biopic

ప్రస్తుతం విజయ్ సేతుపతి.. క్రికెట్ కోచ్‌ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. మరికొంత కాలం శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన షూటింగ్‌కు వెళ్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో పాత్రలతో విలక్షణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. మురళీధరన్ పాత్రలోనూ కచ్చితంగా మెప్పిస్తాడని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మరోవైపు, ఇదే విషయంపై ముత్తయ్య మురళీధరన్ కూడా స్పందించాడు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో జర్నలిస్టులు దీనిని ప్రస్తావించగా.. 'అవును.. నా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కించడానికి కొందరు నన్ను సంప్రదించారు. అయితే, అందులో విజయ్ నటిస్తారని నాకు తెలియదు. ఒకవేళ ఆయన నటిస్తే చాలా బాగుంటుంది. మా అత్తగారి ఊరైన చెన్నైలో నా బయోపిక్ వస్తే బాగుంటుంది కదా' అంటూ చెప్పుకొచ్చారు. మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టి రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X