Singer Rahul Sipligunj: ఎమ్మెల్యే అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజ్ పోటీ.. అసలు విషయం చెప్పేశాడుగా!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రియాలిటీ షో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఈ మధ్యకాలంలో ప్రచారం అయితే జరిగింది. ఆయన గోషామహల్ నియోజకవర్గం నుంచి ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు అయితే వచ్చాయి. అయితే ఈ రూమర్స్ పై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రియాక్ట్ అయ్యారు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అసలు విషయం ఏంటో చెప్పుకొచ్చారు. ఆయన ఈ ప్రచారంపై ఎలా స్పందిచాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్టార్ సింగర్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ యాసలో సాంగ్స్ పాడుతూ.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతే కాదు.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కాల భైరవతో కలిసి నాటు నాటు సాంగ్ పాడాడు. ఇక ఈ పాటకు ఆస్కార్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన హాలీవుడ్ గడ్డపై ఈ పాట పాడి రచ్చ చేశాడు.

తెలుగు బిగ్ బాస్ లోనూ రాహుల్ సిప్లిగంజ్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక బిగ్ బాస్ లో పునర్నవి, రాహుల్ మధ్య లవ్ ట్రాక్ కూడా నడిచింది. బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్.. బయటకు వచ్చాకా అదంతా పబ్లిసిటీ స్టంట్ అని తేల్చేశారు. ఇక వరుసగా సినిమాల్లో తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న రాహుల్ సిప్లిగంజ్ పై గత కొన్ని రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది.
రాహుల్... రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం అయితే జరిగింది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ ప్రముఖ పార్టీకి పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

రాహుల్ ఇన్ స్టాలో రాస్తూ... నా మీద చాలా రూమర్స్, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా అస్సలు పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్టును.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు.. అంటూ రాసుకొచ్చాడు.
తాను సంగీతాన్నే తన కెరీర్ గా ఎంచుకున్నట్లు చెప్పిన రాహుల్.... ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ఏ పార్టీ తనకు ఆహ్వానాలు పంపలేదని వెల్లడించారు. తాను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదన్నారు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి.. అంటూ నోట్ షేర్ చేశాడు. 'రూమర్స్ రావడం సాధారణం.. కానీ ఈ రూమర్ మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్ లో చెప్పుకొచ్చాడు. ఇక రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ.. వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది.


Click it and Unblock the Notifications











