సంక్రాంతి సంబరాలకు సిధ్ధమవుతున్న స్టార్ హీరోలు..!

By Nageswara Rao

తెలుగు వాళ్శ పెద్ద పండగ సంక్రాంతి. సంక్రాంతి సెలవులుకి అందరూ ఇంటికి వస్తారు. కొత్త అల్లుళ్శుతో ఇల్లు అన్ని కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ సమయంలో టాలీవుడ్ హీరోలుకు కూడా పెద్ద పండగే. ఎందుకంటే ప్రతిసంవత్సరం సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలై కోలాహాలం సృష్టిస్తాయి. ఈసారి కూడా చాలా మంది ఈ సంక్రాంతి బరిలో నిలవనున్నారు. సంక్రాంతి హీరోగా పేరోందిన బాలయ్య బాబు పరమవీరచక్ర తో సంక్రాంతికి రానున్నారు. ఈ సినిమానకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల కొమరం పులితో ప్లాప్ ను చవిచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కసిగా ఖుషిగా అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకి జయంతో సి పరాన్జీ దర్శకత్వం వహించగా, గణేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హిందిసినిమా లవ్ ఆజ్ కల్ సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇక ఎన్టీఆర్ మెహార్ రమేష్ దర్శకత్వంలో శక్తి అనే పవర్ పుల్ టైటిల్ తో, ఇలియానా హీరోయిన్ గా సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. పోయిన సంవత్సరం అదుర్స్ తో ఎన్టీఆర్ కూడా సంక్రాంతి హీరో అయ్యాడు.

ఇక ప్రభాస్ దశరధ్ ధర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా అక్కినేని నటవారసుడు నాగచైతన్య కూడా ఈ సారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై తమన్నా హీరోయిన్ గా ఓసినిమా చేస్తున్నారు. దీనిని బట్టి చిన్న హీరోలు పెద్దహీరోలు అందరూ ఈ సారి సంక్రాంతి బరిలో ఉన్నారు. సినిమా టాక్ ను బట్టి మొదటి వారం వసూళ్శు అధారపడి ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X