Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అఖిల్ ఏజెంట్ సినిమాలో స్టార్ హీరో స్పెషల్ రోల్?
అక్కినేని హీరో అఖిల్ నెక్స్ట్ పవర్ఫుల్ హిట్టు కొట్టేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో అతను చేస్తున్న సినిమాపై అప్పుడే భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అభిమానులకు బాగా నచ్చాయి. సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్ కూడా గట్టిగానే పెడుతున్నట్లు టాక్ వస్తోంది.
అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక సినిమాలో మళయాళం సీనియర్ హీరో మోహన్ లాల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోంది. పాత్ర నచ్చితే మోహన్ లాల్ ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పరు.
ఇక సురేంధర్ రెడ్డి డిజైన్ చేసిన పవర్ఫుల్ పాత్రకు కూడా మోహన్ లాల్ ఫిదా అయినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులైతే ముగిశాయి. ఇక దర్శకుడు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి వెంటనే రిలీజ్ డేట్ పై కూడా ముందే క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఏజెంట్ సినిమాతో అయినా అఖిల్ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్టు అందుకుంటాడో లేదో చూడాలి.