పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆ తర్వాత జూ ఎన్టీఆర్...
సినిమా వాళ్లకి కార్ల మీద మోజు తగ్గి రేసింగ్ బైకుల పిచ్చి పట్టింది. డబ్బున్న ప్రతి స్టార్ హీరో లక్షల ఖరీదు చేసే బైకు సొంతం చేసుకోవడం ప్రెస్టీజ్ ఇష్యూలా ఫీలవుతున్నాడు. మొన్న ఆ మద్య నాగార్జున తనయుడు నాగచైతన్య యమహా వైజెడ్ఎఫ్ ఆర్ 1 స్పోర్ట్స్ బైక్ రూ.12.40లక్ష రూపాయల విలువచేసే బైక్ ను ఇమ్ పోర్ట్ చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి అంతర్జాతీయంగా పాపులర్ అయిన బైకుల కంపెనీలు హైదరాబాద్ లో కూడా అవుట్ లెట్లు స్టార్ట్ చేస్తున్నాయిప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్లీ డేవిడ్ సన్ బైక్స్ షో రూమ్ హైదరాబాద్ లో ఇటీవలే ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమయింది. అత్యంత ఖరీదైన మోటర్ బైకుల్లో డేవిడ్ సన్ ఒకటి. 35 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ బైక్ ని ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ బైక్ కొనుగోలు చేసిన ఫస్ట్ కస్టమర్ గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు.
అయితే హార్లీ డేవిడ్ సన్ బైక్ ని ముందుగా సొంతం చేసుకున్న ఆంధ్రడు ఎన్టీఆర్ కాదు. అతని కంటే ముందే ఈ బైక్ ని పవన్ కళ్యాణ్ కొన్నాడు. హైదరాబాద్ లో షోరూమ్ మొదలు కాకముందే విదేశాల నుంచి ఆర్డర్ చేసి డేవిడ్ సన్ బైక్ ని పవన్ తెప్పించుకున్నాడు. అలా ఈ బైక్ సొంతమైన తొలి ఆంధ్రుడిగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ కస్టమర్ గా ఎన్టీఆర్ ఘనత వహించారు. రికార్డుల పరంగానే కాక హీరోల మధ్య బైకుల విషయంలోనూ రేస్ జరుగుతున్నట్టుంది కదూ!


Click it and Unblock the Notifications











