కష్టకాలంలో కీర్తి సురేష్‌కు ఆ నలుగురు హీరోయిన్లు సపోర్ట్
మహానటి సినిమాతో మంచి నటిగా ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా లాక్ డౌన్ దెబ్బ పడటంతో ఆమె కొత్త సినిమా వెండితెరను మిస్సవుతోంది. కరోనా దెబ్బకు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానున్న మొదటి బిగ్ బడ్జెట్ సినిమాగా పెంగ్విన్ నిలిచింది. థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కీర్తి సురేష్ క్రేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ అందేవి.
పైగా పెంగ్విన్ మూవీ నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది. ఇకపోతే త్వరలో ఈ సినిమాను ఆమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాను ప్రమోట్ చేసేందుకు నాలుగు భాషల నుంచి నలుగురు హీరోయిన్లు టీజర్ లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో సమంత, హిందీ నుంచి తాప్సి, తమిళ్ లో త్రిష, ఇక మళయాళంలో మంజు వారియర్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయడానికి ముందుకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు టీజర్ రిలీజ్ కానుంది.


ఒక స్టార్ హీరోయిన్ కోసం ఇంతమంది స్టార్ హీరోయిన్స్ కలిసి రావడం నిజంగా ఇదొక మంచి పరిణామామనే చెప్పాలి. ముఖ్యంగా ఈ కష్టకాలంలో సినిమా థియేటర్స్ లో విడుదలకు నోచుకోలేక డిజిటల్ వరల్డ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సమయంలో కీర్తి సినిమాకు అండగా నిలిచిన వీరికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే అంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.




Click it and Unblock the Notifications











