పాపం సునీల్ కి అమ్మాయిలు కరువు
సునీల్ ఇప్పుడు ఓ విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నాడు. కమిడియన్ నుంచి హీరోగా ఎదిగిన అతని ప్రక్కన హీరోయిన్ గా చేయటానికి స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఒప్పుకోవటం లేదు. కొత్త హీరోయిన్స్ చేయటానికి సునీల్ కి మనస్సు ఒప్పటం లేదు. అతను కమిటైన కొత్త సినిమాలన్నీ హీరోయిన్ సమస్యతోనే లేట్ అవుతున్నాయి. ఆంటిలుగా మారిన హీరోయిన్స్ మాత్రమే సునీల్ తో సై అంటున్నారు. ఫేడవుట్ స్టేజీలో ఉన్న త్రిష,శ్రియ వంటి వారు కూడా సునీల్ అంటే ఆసక్తి చూపట లేదు. సునీల్ ప్రక్కన చేస్తే పెద్ద హీరోలెవరూ పిలవరని భయపడుతున్నారు.
త్రిషని రీసెంట్ గా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు సునీల్ తో చేసే చిత్రం కోసం అడిగితే ఆమె తెలివిగా ఆపర్ కాదనుకుండా రెండు కోట్లు అడిగింది. వ్రతం చెడ్డా ఫలితం అన్నా దక్కాలిగా అనే స్కీమ్ ఫాలో అవుతోంది. మరో ప్రక్క సునీల్ తో మెగా సూపర్ గుడ్ వారు తను వెడ్స్ మనూ చిత్రం రీమేక్ ప్లాన చేసారు. బ్లేడ్ బాబ్జీ దర్శకుడు దేవి ప్రసాద్ తో చేయబోయ ఈ చిత్రానికి మొదట తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ తర్వాత ఆమె శ్రేయాభిలాషుల సూచనల మేరకు నో చెప్పేసింది. దాంతో సునీల్ ఇప్పుడు తనతో ఎవరు హీరోయిన్స్ గా చేస్తారని ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











