అతి కష్టం మీద ఆ కోరిక ఆపుకుంటున్నా: ఇలియానా
షూటింగ్ కి ఆటంకం కలుగుతుందేమోనని అతి కష్టం మీద ఆ కోరికను వదులుకుంటున్నానని గోవా బ్యూటీ ఇలియానా అంటున్నారు. ఇంతకీ ఇలియానా ఆపుకుంటున్న ఆ కోరిక ఏమిటంటే...వానలో తడవటం..ఈ విషయం చెబుతూ..నాకు వర్షంలో తడవటం చాలా ఇష్టం. ముఖ్యంగా స్కూల్ డేస్‌లో అయితే వానలో తడిచేదాన్నని, ఇప్పుడలా తడిస్తే..షూటింగ్ కు ఇబ్బంది అవుతుందని ఆపుకుంటున్నాను అంది. ఇక హన్సిక కూడా ఇలాంటి కోరికనే వ్యక్తపరిచింది. వాన కురిసినప్పుడు షూటింగ్స్ లేకపోతే చాలు పూర్తిగా తడిచిపోతానని అంటున్నారామె. ఒకవేళ ఆ సమయంలో ఇంటి పట్టున ఉంటే మాత్రం..నచ్చిన పుస్తకం ముందేసుకుని, వేడి వేడి కాఫీ తాగుతూ, ఆ బుక్ చదివేస్తానని హన్సిక అంటోంది. అలాగే తమన్నాకు కూడా వానలో తడవడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పుడు అమ్మ వద్దన్నా వినకుండా వర్షంలో తడిచి, తిట్లు తినేదాన్ననని అంటున్నారు. వర్షాకాలంలో ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయి తను తడిచిన సంఘటనలను గుర్తు చేసుకుని ఆమె ఆనందపడిపోతుంటానని చెప్పుకొచ్చింది. ఇలా ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఈ వానాకాలం తమకెంతో ఇష్టమని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











