Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మహేష్ నిర్మాతలను రిజెక్ట్ చేసిన లేడి డైరెక్టర్.. మరో బయోపిక్ కోసం ప్రయత్నాలు
సాధారణంగా ఒక డైరెక్టర్ హిట్టు కొడితే పెద్ద నిర్మతల ఆఫర్స్ కు అంత ఈజీగా నో చెప్పరు. అయితే ఇటీవల సుధ కొంగర ఒక ప్రొడక్షన్ హౌజ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొన్న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాశం నీ హద్దురా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సూర్య కథానాయకుడిగా నటించిన ఆ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
అంతకుముందు కేవలం గురు సినిమాతో తమిళ్ తెలుగులో కాస్త క్రేజ్ అందుకున్న సుధ ఇప్పుడు హిట్ అందుకోగానే అగ్ర హీరోలతో పాటు అగ్ర నిర్మాణ సంస్థలు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సుధ టాలెంటెడ్ డైరెక్టర్ కావడంతో ఆమెతో సినిమా చేస్తే ఒక మహిళకు సపోర్ట్ చేసిన క్రేజ్ కూడా అందుతుందని తమిళ్ స్టార్ హీరోలు ఇప్పటికే ఆమెకు డైరెక్ట్ గా ఆఫర్స్ ఇచ్చారని తెలుస్తోంది. మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ కూడా సుధ కొంగరతో ఎలాగైనా ఒక పాన్ ఇండియా సినిమాను చేయాలని అనుకున్నారు.
కానీ సుధ కొంగరా వారి ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా కూడా ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ కారణంగా మరో రెండేళ్ల వరకు కొత్త ప్రాజెక్టు ఒకే చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ తో ఇదివరకే ఒక ఒప్పందం కుదుర్చుకున్న సుధ ఆ సంస్థతో రతన్ టాటా బయోపిక్ ను ప్లాన్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో పాటు అజిత్ కూడా ఆమెతో వర్క్ చేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.