పూజా హెగ్డే ఎఫెక్ట్.. ఆ రూట్లో మంచి లాభాన్ని అందుకున్న అఖిల్
అక్కినేని యువ హీరో అఖిల్ ఇటీవల తన నాలుగవ సినిమా పోస్టర్ తో స్పెషల్ గా దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడా అని ఎంతో కాలంగా ఎదురు చూసిన అభిమానులకు ఫైనల్ గా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాడు. పోస్టర్ ద్వారా సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుందని నమ్మకంగా చెప్పేశారు.
ఇక పోస్టర్ సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. పూజా హెగ్డే తన అందమైన కాళ్లతో అఖిల్ చెవిని తాకుతూన్న తీరుకు ఓ వర్గం అభిమానులు షాక్ అయ్యారు కూడా. ఎదో ఒక విధంగా క్రియేట్ చేసిన బజ్ కి ఒక విధంగా లాభం చేకూరినట్లు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ పరంగా సినిమాకు మంచి ఆఫర్ దక్కింది.

స్టార్ మా ఛానెల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హక్కులను రు.6.50కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అఖిల్ గత సినిమాల కంటే కూడా ఈ ఎమౌంట్ చాలా ఎక్కువే అని చెప్పాలి. వరుసగా అపజయాలు ఎదురవుతున్నప్పటికి అఖిల్ మార్కెట్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగని పెరిగింది లేదు. అఖిల్ ఇంకా ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని నాగార్జున బలంగా కోరుకుంటున్నాడు. కానీ అఖిల్ కి అలాంటి కథలు దొరకడం లేదు. మరి భవిష్యత్తులో అయినా దొరుకుతాయేమో చూడాలి.
గీత ఆర్ట్స్ కి చెందిన GA2 ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అసలైతే సమ్మర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. లాక్ డౌన్ అనంతరం ఆగస్ట్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక ఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేయనున్నట్లు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











