బిగ్‌బాస్ 2: శ్రీరెడ్డి కూడా ఉంది.. కానీ, ముంబై నుంచే మొత్తం!
Recommended Video

బిగ్‌బాస్ 2లో శ్రీరెడ్డి ఎంపిక కాకుండా నాని అడ్డుకున్నాడనే వార్తల నేపథ్యంలో స్టార్ మా యాజమాన్యం స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. నాని టార్గెట్ గా శ్రీరెడ్డి దారుణంగా వ్యక్తిగత దూషణలు దిగుతున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ 2 కు నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ మా యాజమాన్యం ఎంపిక చేసిన 16 మంది కంటెస్టెంట్స్ తో ఇటీవల బిగ్‌బాస్ 2 షో ప్రారంభమైన సంగతి తతెలిసిందే. శ్రీరెడ్డి విషయంలో నానిపై వస్తున్న ఆరోపణలకు స్టార్ మా యాజామాన్యం క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాలతో బిగ్‌బాస్ 2
భారీ అంచనాలు, హైప్ తో ఇటీవల బిగ్‌బాస్ 2 ప్రారంభమైనది. దాదాపు 100 రోజులపాటు సాగె ఈ షోలో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు గత సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

125 మంది పేర్ల పరిశీలన
బిగ్‌బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ కోసం ముంబై లోని బిగ్‌బాస్ టీం దాదాపు 125 మంది పేర్లని పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జాబితాలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందట.

స్పష్టం చేసిన స్టార్ మా
నానిపై వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో స్టార్ మా క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నాని ప్రమేయం ఏమాత్రం లేదని అంటున్నారు. పరిశీలించిన వారందరి పేర్లని ఎంపిక చేయడం కుదరదు అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అర్థం లేని ఆరోపణలు
ఇలాంటివన్నీ అర్థం లేని ఆరోపణలు అని నాని ఓ ఆంగ్ల పత్రికలో కూడా స్పందించాడు. శ్రీరెడ్డి నానిపై వ్యక్తిగతంగా దూషణకు దిగిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











