స్టార్ నైట్ కి వచ్చిన మొత్తం ఎంతంటే...
శనివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పోగ్రాం ద్వారా ఐదు కోట్ల 28 లక్షల 47 వేల 101 రూపాయలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి హజరైన ముఖ్యమంత్రి రోశయ్యకు దాసరి నారాయణరావు, బాలకృష్ణ తదితరులు ఈ చెక్కును అందచేశారు. ఈ మొత్తంతో వరద బాధితులకు చలన చిత్ర పరిశ్రమ తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తానికి సమానమైన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి జోడిస్తానని ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. ఈ మొత్తంతో చేపట్టే సహాయ పనులను గుర్తించడానికి సినిమా ప్రముఖులు,అధికారులతో ప్రత్యేక కమిటీ వేస్తామని ఆయన తెలిపారు.
స్టార్ నైట్ బాలకృష్ణ నాగార్జున రజనీకాంత్ సూర్య గచ్చీబౌళి స్టేడియం ఐదు కోట్లు దాసరి వరద బాధితులు రోశయ్య star night five crores dasari balakrishna nagarjuna rajanikanth surya


Click it and Unblock the Notifications