twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మగధీర’ 100 డేస్ కి ‘స్టార్ నైట్’ అడ్డంకి అవుతుందా?

    By Sindhu
    |

    ఒకటి, రెండు, మూడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 7న జరగనున్న 'స్టార్ నైట్" ప్రోగ్రామ్ కి సంబంధించిన కౌంట్ డౌనే ఇది. వరద బాధితుల సహాయార్థం యావత్ చిత్రపరిశ్రమ ఏకమై ఈ కార్యక్రమాన్ని చేయనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది మొదటగా బాలకృష్ణ. ఈ ప్రపోజల్ ని ఆయనే తీసుకోచ్చారు. అనంతరం దాసరిలాంటి పెద్దలు దీనికి ఆమోదం తెలిపి పరిశ్రమకి చెందిన అన్ని శాఖలకి సంబంధించిన ప్రముఖులను ఆహ్వానించి మాట్లాడారు. దీనికి 'స్పందన" అని చక్కటి పేరు కూడా పెట్టారు.

    ఈ కార్యక్రమంలో తెలుగు సినీరంగానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా తమిళ రంగం వారు కూడా పాల్గొననున్నారు. విరాళాలు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. సో మొత్తం 3 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి రోశయ్య చేతికి ఇవ్వనుంది సినీ పరిశ్రమ. శనివారం 07.11.09 జరగనున్న స్టార్ నైట్ కి ఆ రోజు పెర్ఫామ్ చేయబోయేవారు ప్రస్తుతం రిహార్సల్ చేస్తున్నారు. ఎంతో మంది ప్రేక్షకులు ఎలాగైనా టిక్కెట్లు సాధించి ఈ వేడుకని వీక్షించాలనుకుంటున్నారు. టిక్కెట్ల ధర పెద్ద మొత్తంలో ఉన్నాకూడా అమ్మకం మాత్రం జోరుగా ఉంటుందనే అంచానాలు ఉన్నాయి. మొత్తం చిత్రసీమతో పాటు ఈ వేడుకను వీక్షించే ప్రేక్షకులతో గచ్చిబౌలి ప్రాంగణం నిండతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలాగే ఇది లైవ్ షో కాబట్టి టీవీల ముందు అతక్కుపోయే జనాలు కూడా చాలామందే ఉంటారు. కానీ ఇది 'మగధీర"కి మైనస్ అయ్యే అవకాశం ఉంది.

    సరిగ్గా నవంబర్ 7 తో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన 'మగధీర" వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ వేడుకని నిర్వహించాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారట. అయితే అదే రోజు స్టార్ నైట్ ప్రోగ్రామ్ భారీ ఎత్తున జరగడం వల్ల చిరంజీవి కుటుంబం కూడా అందులో పాల్గొనాల్సి ఉండటం వల్ల? 'మగధీర" శతదినోత్సవ వేడుక నిర్వహించలేని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో 'స్పందన" వేదిక మీద ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. విడిగా చేస్తే మాత్రం చిరంజీవి నలుగురి నోళ్లల్లో నానే అవకాశం ఉంది. మరి నవంబర్ 7న ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X