నాంది ఎఫెక్ట్.. అల్లరి నరేష్‌కు సీనియర్ నిర్మాత బంపర్ ఆఫర్.. మొత్తానికి ఆ డ్రీమ్ నిజమవుతోంది!
కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తో ఒకప్పుడు తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న అల్లరి నరేష్ వరుస ప్లాప్స్ తో ఆ మార్కెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. మార్కెట్ సంగతి పక్కన పెడితే ఎలాంటి సినిమా చేసినా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. ఇక కామెడీ జానర్ ను పక్కన పెట్టి నాంది సినిమాతో చేసిన సరికొత్త థ్రిల్లర్ జనర్ నరేష్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా కారణంగా ఇప్పుడు నరేష్ కు ఒక ఆఫర్ కూడా వచ్చింది.

100% న్యాయం చేశాడు
ఎలాగైనా ఈ సక్సెస్ ను కంటిన్యూగా అందుకోవాలని నరేష్ కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాంది సినిమా సక్సెస్ కావడానికి అసలు కారణం నరేష్ హార్డ్ వర్క్ అనే చెప్పాలి. దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న కథకు 100% న్యాయం చేశాడు. మొదటిసారి న్యూడ్ సీన్ లో నటించి అందరికి షాక్ ఇచ్చాడనే చెప్పలి.

దిల్ రాజు ప్రశంసలు
ఇక నరేష్ హార్డ్ వర్క్ చూసి నిర్మాత దిల్ రాజు షాక్ అయ్యారు. అసలు ఏ మాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా అప్పటికప్పటికే సక్సెస్ మీట్ ను నిర్వహించి చిత్ర యూనిట్ ను స్పెషల్ గా అభినందించారు. దర్శకుడు విజయ్ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మూడు సినిమాలకు అసిస్టెంట్స్ గా వర్క్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇంత మంచి సినిమాను తెరపైకి తెస్తారని అనుకోలేదని మాట్లాడారు.

నరేష్ డ్రీమ్ నిజం కాబోతోంది..
ఇక నాంది సినిమా సక్సెస్ మీట్ లోనే దిల్ రాజు నరేష్ కు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. తప్పకుండా నరేష్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అంటూ మంచి కథ ఉంటే తీసుకురావాలని కూడా చెప్పారు. దీంతో అల్లరి నరేష్ ఎంతగానో సంతోషించాడు. నరేష్ చాలా కాలం నుంచి దిల్ రాజుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఆ కల మొత్తానికి నిజం కాబోతోంది. ప్రస్తుతం నరేష్ కు ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. అయితే తొందరపడకుండా సరైన కథలను సెలెక్ట్ చేసుకోవాలని అడుగులు వేస్తున్నారు.

నాంది రీమేక్ రైట్స్ అందుకున్న దిల్ రాజు
ఇక నాంది సినిమా హిట్టవ్వడంతో ఆ కథను ఇతర భాషల్లో రీమేక్ చేస్తే ఇంకా పెద్ద విజయాన్ని అందుకోవచ్చని కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఇక రీమేక్ రైట్స్ ఎవరు తీసుకోకముందే దిల్ రాజు ముందు జాగ్రత్తగా దర్శక నిర్మాతలతో ఒక డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సింగిల్ పేమెంట్ తో కొనుగోలు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











