దిల్ రాజు చేతుల్లోకి కళ్యాణ్ రామ్ సినిమా.. ఎన్టీఆర్ రాబోతున్నాడా!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 118 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోందిప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకుడిగా మారి తెరక్కిస్తున్న చిత్రం ఇది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో 118పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో 118 గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిల్ రాజు చేతుల్లోకి
ప్రముఖ నిర్మాత దిల్ రాజు 118 చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 118 చిత్ర నిర్మాతలతో దిల్ రాజు డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో 118ని విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. దిల్ రాజు తరచుగా పలు చిత్రాలని నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు.

విజయం కోసం
పటాస్ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ మళ్ళీ పరాజయాల బాట పట్టాడు. కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే, నా నువ్వే చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో ఈ నందమూరి హీరో ప్రస్తుతం 118పై అసలు పెట్టుకుని ఉన్నాడు. చాలా కాలం పటు హిట్ లేకుండా ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ ద్వారా విజయం లభించింది. తన కెరీర్ కు జోష్ నిచ్చే విజయం కోసం కళ్యాణ్ రామ్ ఎదురుచూస్తున్నాడు.

ఎన్టీఆర్ వస్తాడా
ఈ మధ్య నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకరి సినిమా ఫంక్షన్ లకు మారారు హాజరవుతున్నారు. 118 ప్రీరిలీజ్ ఈవెంట్ కు తన సోదరుడి కోసం ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 1న చిత్రం విడుదల కానుండడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలని షూరూ చేయనున్నారు.

సరికొత్తగా
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త లుక్, బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు. ఇటీవల థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ 118 ఏ మేరకు రాణిస్తుందో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











