ప్రేక్షకుల్ని చెడగొట్టింది సినిమా వాళ్లే.. దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు
కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ప్రేక్షకుడికి ఇంట్లోనే వినోదం అందించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని ఒరిజినల్ కంటెంట్, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించారు జనం. కోవిడ్ తర్వాతి నుంచి ప్రేక్షకులు సినిమా చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. కథ లేకుండా రెగ్యులమర్ కమర్షియల్ ఫార్మాట్‌తో సినిమాలు తీస్తే నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఎంత పెద్ద సూపర్‌స్టార్ నటించినా సరే రిజల్ట్ మాత్రం ఇదే అన్నట్లుగా వ్యవహరించారు.
కరోనా తగ్గుముఖం పట్టి పరిస్ధితులు కుదటపడ్డాక కూడా జనం ఓటీటీలను విడిచిపెట్టలేదు. దీనికి కారణం థియేటర్లలో టికెట్ల ధరలే. ఓ కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఖచ్చితంగా రూ.1500 నుంచి రూ.2000 వెచ్చించాలి. పెట్రోల్ ఖర్చులు, పాప్ కార్న్ , సమోసా దీనికి అదనం. దారిలో వస్తూ వస్తూ ఏ రెస్టారెంట్‌కో వెళితే మరో రూ.5000.. ఇలా మొత్తంగా ఓ పదివేలు హారతి కర్పూరంలా కరిగిపోతుండటంతో మధ్యతరగతి, పేదలు థియేటర్ వంక కన్నెత్తి చూడటం లేదు. 1000 నుంచి 2000 ఖర్చుతో మొత్తం ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ఏడాది సబ్‌స్క్రిప్షన్ తీసుకుని.. ఓ పది రోజులు ఓపిక పడితే ఇంట్లోనే దర్జాగా పకోడీలు తింటూ సినిమా చూడొచ్చనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు.

కొందరు దర్శక నిర్మాతల అత్యుత్సాహం కూడా జనాన్ని థియేటర్‌కు దూరం చేస్తున్నాయి. బడా సినిమాలే థియేటర్‌లో విడుదలవుతుండటంతో చిన్న సినిమాలు తప్పనిసరి పరిస్ధితుల్లో ఓటీటీలను వెతుక్కుంటున్నాయి. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడితే నెల తిరక్కుండానే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇలాంటప్పుడు ప్రేక్షకుడు సినిమా హాల్‌కు ఎందుకొస్తాడని సినిమా జనాలు ప్రశ్నిస్తుంటారు.
ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకుల్ని థియేటర్‌కు రాకుండా తామే చెడగొట్టామని వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదని.. ప్రేక్షకుడిని థియేటర్‌కు వచ్చి ఈ మూవీని చూడగలిగేలా చేయడమే పెద్ద ఛాలెంజ్ అని చెప్పారు. బలగం, కమిటీ కుర్రోళ్లు వంటి చిన్న సినిమాలు మౌత్ టాక్‌తో ప్రేక్షకుల్ని థియేటర్‌కు రప్పించాయన్నారు.
ప్రేక్షకులు మంచోళ్లని .. కానీ మీరు ఇంట్లో కూర్చోండి.. నాలుగు వారాల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తామని మేమే చేజేతులా చేసుకున్నామని దిల్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రేవు సినిమా చూసి తాను కూడా రివ్యూ ఇస్తానని.. చిన్న సినిమాలు నిలదొక్కుకునేలా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సహకరించాలని దిల్‌రాజు చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు .. ఇతర ఇండస్ట్రీల్లో మాదిరిగానే తెలుగులోనూ ఓటీటీ రిలీజ్‌లకు కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











