ఎన్టీఆర్ వీపకు గాయం అయినా...షీలా
ఎన్టీఆర్ కు ఈమధ్యనే ఓ ప్రమాదంలో వీపు మీద బలమైన గాయం అయింది. అయినప్పటికీ అదుర్స్ చిత్రంలో ఎన్టీఆర్ మతిపోగొట్టే స్టెప్స్ వేసి తన సత్తా చాటుకున్నారు' అంటూ ఎంతో ఎగ్జయిట్ చెప్తోంది షీలా. అలాగే 'అదుర్స్' చిత్రం తర్వాత లెక్కకుమించిన ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయనీ, మొత్తం 10 ఆఫర్లలో ఒక సినిమా ఒప్పుకున్నాననీ, ఓ ప్రముఖ స్టార్ హీరో సరసన ఇందులో నటిస్తున్నాననీ ఆమె తెలిపింది. అదుర్స్ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా ఆమె మీడీయాతో మాట్లాడింది. ఈ సందర్బంగా తనకు అదుర్స్ లో వచ్చిన ఆఫర్ గురించి గుర్తు చేస్కుంటూ..'అదుర్స్'లో నయనతార ఉందని తెలిసినప్పుడు విలేజ్ అమ్మాయిలా కాకుండా గ్లామర్ పాత్ర పోషించాలని అనుకోవడంతో ఆ తరహా పాత్ర తనను వరించిందని షీలా చెప్తోంది. ఇక 'మోడ్రన్ గాళ్ పాత్ర దక్కిన తర్వాత అసలు పరీక్ష మొదలైందని...ఎన్టీఆర్ తో సమానంగా స్టెప్ట్ వేయాల్సి రావటంతో..మొదట్లో కొంచెం భయపడ్డాను. అయితే నాలోని బెరుకును ఎన్టీఆర్ పోగొట్టి ప్రోత్సహించారు అంటోంది. ఇక భవిష్యత్..ఆఫర్స్ గురించి మాట్లాడుతూ..ప్రస్తుతం తాను కేవలం రెండు పదుల వయసులో ఉన్నానని తనకు హడావిడిగా సినిమాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదనీ, కేవలం డబ్బు సంపాదించాలని కాకుండా ఒక గొప్ప నటిగా మిగిలిపోవాలన్నదే తన కోరిక అనీ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











