twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేశ్య అవేవీ ఆలోచించ‌దు, రైటర్ రెండూ ఆలోచించాలి: "బాహుబలి" రైటర్ విజయేంద్ర ప్రసాద్

    రైటర్‌గా విజయేంద్ర ప్రసాద్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఓ మంచి సినిమా కథ‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల గురించి ఆయ‌న ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు.

    |

    Recommended Video

    వేశ్య అవేవీ ఆలోచించ‌దు.. రైటర్ రెండూ ఆలోచించాలి.. -'బాహుబలి' రైటర్

    తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు క‌థ‌లు అందించారు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. "బాహుబ‌లి" వంటి అంత‌ర్జాతీయ స్థాయి చిత్రానికి క‌థ అందించింది కూడా విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్న విష‌యం తెలిసిందే. రాజమౌళి సినిమాల్లో ఒకట్రెండు మినహా అన్నింటికీ ఆయనే కథకుడు. ఈ సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

    బాహుబలి

    బాహుబలి

    జక్కన్న దర్శకుడు కావడానికంటే ముందు ఆయన "బొబ్బిలి సింహం" "సమరసింహారెడ్డి" లాంటి సినిమాలకు పని చేశారు. ఐతే ఆయన రచయితగా ఎక్కువ పేరు సంపాదించింది గత కొన్నేళ్లలోనే. ఓవైపు "బాహుబలి".. మరోవైపు "భజరంగి భాయిజాన్" లాంటి సినిమాలకు కథ అందించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది.

    రచన గురించి.

    రచన గురించి.

    కథల గురించి.. రచన గురించి.. ఆయన చెప్పే విషయాల్ని దేశంలోని అన్ని సినీ పరిశ్రమల వాళ్లూ చాలా ఆసక్తిగా వింటారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఓ మంచి సినిమా కథ‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల గురించి ఆయ‌న ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు.

     వేశ్య అవేవీ ఆలోచించ‌దు

    వేశ్య అవేవీ ఆలోచించ‌దు

    `సాధార‌ణంగా ఓ ఇల్లాలు త‌న భ‌ర్త ఆరోగ్యంపై చాలా శ్ర‌ద్ధ చూపెడుతుంది. స్వీట్లు ఎక్కువ‌ తింటే షుగ‌ర్ పెరుగుతుంద‌ని, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంద‌ని భ‌ర్త‌ను అదుపులో ఉంచుతుంది. కానీ, ఓ వేశ్య మాత్రం అవేవీ ఆలోచించ‌దు. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవారికి ఆనందం అందించి డ‌బ్బు సంపాద‌న‌పైనే దృష్టి పెడుతుంది.

    కథ రాసేటపుడు

    కథ రాసేటపుడు

    ఒక కథ రాసేటపుడు ఈ రెండు విషయాల్నీ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఒక భార్య తరహాలో కథలో నిజాయితీ ఉండాలని.. అదే సమయంలో వేశ్య లాగా ఎలాగైనా సరే డబ్బులు రాబట్టే లక్షణాలు ఆ కథలో ఉండాలని.. ఇలా ఉన్న కథే ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెప్పారు.

    English summary
    popularity has grown to the entire country with the films like Baahubali and Bhajrangi Bhaijaan. Recently he has opened about writing and his statements on writing have been going viral now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X