దిల్‌రాజు కూతురు పెళ్లిలో స్టార్స్, ఏర్పాట్లు కేక (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు హన్సితారెడ్డి వివాహాన్ని అంగరంగం వైభవంగా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎండలు ఎక్కువగా ఉండటంతో ఊటీలో వివాహం మహోత్సవం నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా ఈ వివాహానికి అదిరిపోయే ఏర్పాట్లు చేసారు దిల్ రాజు.
హన్సితారెడ్డి వివాహం ప్రముఖ పారిశ్రామిక వేత్త అర్చిత్ రెడ్డితో జరుగుతోంది. ఊటీలోని ఫెర్ని హిల్స్ అనే ప్రాంతంలో ఈ వివాహానికి ఏర్పాట్లు చేసారు. ఈ రోజు(మే 2)న వివాహం జరుగబోతోంది. ఈ వివాహ వేడుకకు దిల్ రాజకు సన్నిహితంగా ఉండే టాలీవుడ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు.
నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, బివిఎస్ రవి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, దేవిశ్రీ ప్రసాద్, గోపీచంద్ మలినేని, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. వివాహానికి ముందు సంగీత్, మెహందీ కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ నెట్వర్కింగ్ ద్వారా బయటకు వచ్చాయి.

టాలీవుడ్ ప్రముఖులు
దిల్ రాజు కుమార్తె వివాహానికి హాజరైన అల్లు అరవింద్, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు.

ఏర్పాట్లు అదిరాయి
పెళ్లి వేడుక సందర్బంగా చేసిన పలు ఏర్పాట్లు అదిరిపోయేలా ఉన్నాయి. అలంకరణ కోసం విదేశాలను పూలు తెప్పించారు.

బాలీవుడ్ సినిమాల్లో మాదిరి..
బాలీవుడ్ సినిమాల్లో జరిగే హై ప్రొఫైల్ వెడ్డింగ్ మాదిరిగా పచ్చిక బయళ్ల మీద ఏర్పాట్లు.

ప్రముఖులు
వివాహ వేడుక వద్ద అల్లు అరవింద్, ప్రకాష్ రాజ్, సుకుమార్, వంశీ పడిపల్లి తదితరులు

హరీష్ శంకర్, బివిఎస్ రవి, అరవింద్
దిల్ రాజు కూతురు వివాహ వేడుకలో హరీష్ శంకర్, బివిఎస్ రవి, అల్లు అరవింద్.

కూతురుతో దిల్ రాజు
కూతురు హన్సిత రెడ్డితో కలిసి దిల్ రాజు. ఎంగేజ్మెంట్ నాటి ఫోటో ఇది.

హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి
హన్సిత రెడ్డి, అర్చిత్ రెడ్డి ఎంగేజ్మెంట్ నాటి ఫోటో ఇది.
Photos via Facebook


Click it and Unblock the Notifications











