సినీ స్టార్స్‌కు రక్షణ లేదు: బిపాస
అన్నా హజారే చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటిస్తున్న సినీ తారల్లో బిపాస బసు ఒకరు. హజారే ఉద్యమానికి చేదోడు వాదోడుగా తన వంతు ప్రయత్నం చేస్తోంది. అయితే ప్రత్యక్షంగా హజారే దీక్ష శిబిరానికి వెళ్లి, ఆయన్ను కలిసి సపోర్టు ఇవ్వడం లాంటి పనులు మాత్రం చేడం లేదు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన 'ఎయిర్ టెల్ ఢిల్లీ హాఫ్ మారథాన్-2011" కార్య్రకమంలో బిపాసను కొందరు ఈ విషయమై ప్రశ్నిస్తూ.. "మీరు హజారే ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు కదా..మరి ఎందుకు రాంలీల మైదానికి కనీసం ఒక్కసారైనా రావడం లేదు?" అని అడిగారు.
ఆ ప్రశ్నకు సమాధానంగా బిపాస స్పందిస్తూ....వెళ్లాలని మాకూ ఉంది, కానీ మేము సీనీ తారలం, పబ్లిక్ లోకి వస్తే మాకు అనేక ఇబ్బంది తప్పదు, ఒక రకంగా చెప్పాలంటే తారలకు రక్షణ లేదు" అందుకే హజారే పై అభిమానం ఉన్నా రాంలీల మైదానానికి వచ్చి కలవలేక పోతున్నాం అంటూ సమాధానం ఇచ్చింది బిప్స్.


Click it and Unblock the Notifications











