నాగార్జున,మోహన్ లాల్,ముమ్మట్టి కలిసి ఒకే చిత్రంలో...
హైదరాబాద్: ముమ్మట్టి,మోహన్ లాల్, నాగార్జున కలిసి ఓ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ చిత్రాన్ని నటుడు,నిర్మాత,దర్శకుడు ప్రకాష్ రాజ్ డైరక్షన్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ మీడియాకు ఖరారు చేసి తెలిపారు. ముగ్గురు స్టార్స్ నటించటంతో చిత్రం పై మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.
ఇక ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... "అవును, నేను ముగ్గరు స్టార్స్ తో మాట్లాడాను. వ్చే నెల నుంచీ షూటింగ్ మొదలు అవుతుంది. తెలుగు,మళయాళం, తమిళం భాషల్లో ఒకేసారి షూట్ చేస్తాం. హీరోయిన్స్ అన్వేషణ ప్రస్తుతం జరుగుతోంది."అన్నారు. ఇదో కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇక ప్రకాష్‌రాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఉలవచారు బిర్యాని'. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో స్నేహ నాయిక. ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిరిస్తున్న ఈ చిత్రానికి వల్లభ నిర్మాత. ఈ నెల 26న ప్రకాష్‌రాజ్ జన్మదినం సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం మంగళవారం విడుదలచేసింది.

చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ''నటుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ప్రకాష్‌రాజ్ ఈ చిత్రంతో దర్శకునిగానూ ప్రతిభ చూపనున్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ నెల 31న పాటల్ని విడుదల చేస్తామ''న్నారు. ఈ చిత్రంలో తేజస్, సంయుక్త, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: జయరామన్, కళ: కదిర్, కూర్పు: జో.వి.హర్ష.


Click it and Unblock the Notifications











