జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల పెళ్లికి కదలి వచ్చిన తారలు
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహానికి తారలు కదలి వచ్చారు. అలనాటి దిగ్గజాల మొదలు నేటి తారల వరకు ఈ వివాహానికి విచ్చేశారు. అక్కినేని నాగేశ్వర రావు, సూపర్‌స్టార్ కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు దంపతులు, సుమలత, రామానాయుడు, మురళీ మోహన్, నాగార్జున, అమల, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, శ్రీకాంత్, బ్రహ్మానందం, రఘుబాబు, అలీ, ప్రియమణి, నాజర్, మంచు లక్ష్మీ ప్రసన్న, తమిళ తారలు ప్రభు, కార్తి తదితరులు వధూ వరులను ఆశీర్వదించారు. ఇటీవలే ఓ ఇంటి వాడైన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అశ్వనీదత్, రాజు, సురేశ్ బాబు, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద రెడ్డి, నల్లమలుపు బుజ్జి, బోగవల్లి ప్రసాద్, ఎంఎల్ కుమార్ చౌదరి తదితరులు అతిథులకు ఆహ్వానం పలికారు. పెళ్లి విందులో పసందైన వంద రకాల వంటకాలను ఏర్పాటు చేశారు. సహ పంకి భోజనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ పెళ్లికి సుమారు 12 వేల మంది హాజరైనట్లు అంచనా. ఎన్టీఆర్ పెళ్లి వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.
కోలాహలం సృష్టించారు. ఒక దశలో తోపులాట సైతం జరిగింది. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో కాసేపు గందరగోళం నెలకొంది. లాఠీచార్జీలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. పెద్ద స్థాయిలో ప్రముఖులు తరలి రావడంతో హైటెక్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


Click it and Unblock the Notifications











