ఫోటోలు : మంజుల భౌతిక దేహానికి స్టార్స్ నివాళి
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి మంజుల మంగళవారం అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మంజుల మృతి విషయం తెలిసిన వెంటనే దక్షిణాది సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగి పోయింది. పలువురు ప్రముఖ తారలు మంజుల భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అనారోగ్యంతో చెన్నైలోని ఎస్ఆర్ఎంసి ఆసుపత్రిలో చేరిన మంజుల తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె వయసు ప్రస్తుతం 59 సంవత్సరాలు. ఆమెకు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె భర్త విజయకుమార్ ప్రముఖ నటుడు. ఆమె కూతుర్లు కూడా హీరోయిన్లుగా నటించారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో మంజుల నటించారు. మంజుల తొలి చిత్రం శాంతి నిలయం. ఈ తమిళ సినిమాలో 1969లో ఆమె బాలనటిగా నటించారు. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం వాసు. మొన్నటితరం తెలుగు అగ్రహీరోలు అందరితోనూ మంజుల నటించి మెప్పించారు.
మంజుల భౌతిక దేహాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు ఫోటోలు స్లైడ్ షోలో...

నటుడు విజయ్ కుమార్
మంజుల మృత దేహం వద్ద రోధిస్తున్న ఆమె కుటుంబ సభ్యులు. పక్క చిత్రంలో ఆమె భర్త, ప్రముఖ నటుడు విజయ్ కుమార్, కూతుర్లు శ్రీదేవి మరియు ప్రీతి. మంజుల మరణం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మంజులకు నివాళులర్పిస్తున్న రజనీకాంత్
ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ మంజుల మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. నివాళులు అర్పించారు. మంజుల కుటుంబ సభ్యులకు సంపతాపం తెలిపారు. గతంలో మంజుల రజనీకాంత్‌తో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు.

రజనీకాంత్ మరియు విజయ్ కుమార్
తన భార్య మంజుల భార్య మృతి విషయాన్ని తట్టుకోలేక రోధిస్తున్న దృశ్యాన్ని పక్క ఫోటోలో చూడొచ్చు. కన్నీటి పర్యంతం అవుతున్న విజయ్ కుమార్ ను ఓదార్చుతున్న ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్. వీరు మంచి స్నేహితులు.

విజయ్ కాంత్
నటుడు మరియు డిఎండికె అధ్యక్షుడైన విజయ్ కుమార్ మంజుల మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అదే విధంగా మంజుల కుటుంబ సభ్యులకు విజయ్ కుమార్ ఓదార్చడంతో పాటు సంతాపం ప్రకటించారు.

విజయ్ కాంత్, విజయ్ కుమార్
శోక సముద్రంలో మునిగి పోయిన మంజుల కుటుంబాన్ని విజయ్ కుమార్ ఓదార్చారు. మంజుల భర్త విజయ్ కుమార్‌ను ఓదార్చుతున్న దృశ్యాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చూడొచ్చు. విజయ్ కుమార్, విజయ్ కాంత్ మంచి స్నేహితులు.

నటి లక్ష్మీ
ప్రముఖ దక్షిణాది నటి లక్ష్మీ మంజుల మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మంజుల, లక్ష్మీ కలిసి పలుచిత్రాల్లో నటించారు.

నటుడు ప్రభు
ప్రముఖ తమిళ నటుడు, శివాజీ గణేషన్ కుమారుడు అయిన ప్రభు మంజుల మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

శరత్ కుమార్, విజయ్ కుమార్
ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ మంజుల మృతి విషయం తెలిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శరత్ కుమార్, మంజుల పలు చిత్రాల్లో నటించారు.

రాధిక శరత్ కుమార్
ప్రముఖ నటి, శరత్ కుమార్ భార్య రాధిక మంజుల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కన్నీరు మున్నీరవుతున్న ఆమె కూతుర్లు శ్రీదేవి, ప్రీతిలను రాధిక ఓదార్చారు. రాధిక, మంజుల మంచి స్నేహితులు.

నటుడు శ్రీకాంత్
తమిళ హీరో శ్రీకాంత్ మంజుల భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మంజుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలియజేసారు. మంజుల హఠాన్మరణం సినీ పరిశ్రమలో అందరినీ కలిచి వేసింది.

కెఎస్ రవికుమార్
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు కెఎస్ రవి కుమార్ తన భార్యతో కలిసి మంజు భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన నటిగా మంజుల సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

నటి మీనా
హీరోయిన్ మీనా మంజుల మృతి విషయం తెలసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. మంజులతో కలిసి పలు చిత్రాల్లో నటించిన మీనా ఈ సందర్భంగా మంజుల భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. మంజుల ఫ్యామిలీ మెంబర్స్ కు సంతాపం తెలిపారు.

దర్శకుడు పి వాసు
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు పి వాసు మంజుల భౌతిక దేహాన్ని సందర్శించారు. ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం మంజుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మంజుల లేని లోటు తీర్చలేనిదని, పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయిందన్నారు.

వైజి మహేంద్రన్
తమిళ నటుడు వైజీ మహేంద్రన్ మంజుల మృతి విషయం తెలియగానే ఆమె నివాసానికి చేరుకున్నారు. మంజుల మృత దేహానికి నివాళులు అర్పించారు. మంజుల భర్త విజయ్ కుమార్ తో కలిసి ఆయన ఉన్న దృశ్యాన్ని ఇక్కడ ఫోటోలో చూడొచ్చు.

మనోరమ
తమిళ నటి మనోరమ మంజుల మృతి విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె నివాసానికి చేరుకుని మంజుల భౌతిక దేహానికి నివాళులు అర్పించారు. మంజుల లేని లోటు తర్చలేనిదంటూ ఆమె విచారంలో మునిగిపోయారు.

ఐశ్వర్యధనుష్
రజనీకాంత్ కూతురు ఐశ్వర్యధనుష్ మంజుల భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శోక సముద్రంలో మునిగి పోయిన మంజుల కూతుర్లకు ధైర్యం చెప్పారు. ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ కూడా మంజుల భౌతిక దేహాన్ని సందర్శించారు.

శోక సముద్రంలో స్నేహ
మంజుల మృతి విషయం తెలియగానే నటి స్నేహ వెంటనే ఆమె నివాసానికి చేరుకున్నారు. మంజుల భౌతిక దేహాన్ని చూసిన వెంటనే స్నేహ కన్నీటి పర్యంతమయ్యారు. నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

రాధా రవి
ప్రముఖ నటుడు రాధా రావి మంజుల భౌతిక కాయాన్ని సందర్శించారు. మంజులకు అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంజుల లేని లోటు తీర్చలేనిద, మంజు గొప్ప నటి అని కొనియాడారు.

గౌండమని
ప్రముక తమిళ కమెడియన్ గౌండమని మంజుల మృతి విషయం తెలియగానే ఆమె నివాసానికి చేరుకున్నారు. మంజుల కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. మంజుల భర్త విజయ్ కుమార్‌తో ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సంఘవి
నటి సంఘవి మంజుల భౌతిక దేహాన్ని సందర్శించి నివాళ్లులు అర్పించారు. మంజుల కుటుంబంతో సంఘవికి మంచి సాన్నిహిత్యం ఉంది. మంజుల కుటుంబ సభ్యులకు సంఘవి సానుభూతి తెలిపారు.


Click it and Unblock the Notifications











