»   » సినీస్టార్స్ సీక్రెట్ ‘సం’బంధాలు (ఫోటోఫీచర్)

సినీస్టార్స్ సీక్రెట్ ‘సం’బంధాలు (ఫోటోఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సినిమా రంగంలో చాటు మాటు ప్రేమ వ్యవహారాలు కొత్తేమీ కాదు. అలాంటి వార్తలతో పలువురు పాపులర్ స్టార్స్ తరచూ వార్తల్లో కెక్కడం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయమై వారిని ప్రశ్నిస్తే మాత్రం అబ్బే మా మధ్య అలాంటిదేమీ లేదు...మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఇందులో కొన్ని నిజాలు కావచ్చు...మరికొన్ని నిజాలు కాక పోవచ్చు.

  బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్....ఇలా ఏ పరిశ్రమలో అయినా సినీతారలపై ఇలాంటి ఈ మధ్య సర్వసాధారణం అయిపోయాయి. కొందరు తారలు పబ్లిసిటీ పెంచుకోవడానికి కూడా ఇలాంటి ఎఫైర్లు పెట్టుకునే ట్రెండు కూడా ప్రారంభమైంది. ఇలాంటి ఇలాంటి సంబంధాలతో తమ కెరీర్‌లో ఎదిగిన వారూ ఉన్నారు.

  ఇలాంటి వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌‌గా మారిన పలువురు సినీ స్టార్ల వ్యవహారంపై ఈ వీకెండ్ ఓ లుక్కేద్దాం.....

  రణబీర్-కత్రినా

  రణబీర్-కత్రినా

  ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన జంట రణబీర్ కపూర్-కత్రినా కైఫ్. ఈ వీరు చేస్తున్న పనులు చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో ‘సం'బంధం ఉందనే వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ మధ్య వీరు రహస్యంగా విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చారు.

  త్రిష-రాణా

  త్రిష-రాణా

  దగ్గుబాటి యువ హీరో రాణాపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌతిండియా పాపులర్ హీరోయిన్ త్రిషతో రాణా డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని ఆ రూమర్స్ సారాంశం. అయితే చాలా సందర్భాల్లో ఈ వార్తలను ఇద్దరూ యాక్టర్లు ఖండించారు.

  రణవీర్ సింగ్-దీపిక

  రణవీర్ సింగ్-దీపిక

  రణవీర్ సింగ్, దీపిక పదుకొనె ప్రస్తుతం సంజయ్ లీలా దర్శకత్వంలో ‘రామ్ లీలా' చిత్రంలో చేస్తున్నారు. షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ టాక్.

  బిపాసా-హర్మాన్

  బిపాసా-హర్మాన్

  నటుడు జాన్ అబ్రహంతో చాలా కాలంపాటు డేటింగ్ చేసిన బిపాసా...అతనితో విడిపోయిన తర్వాత హర్మాన్‌తో ప్రేమలో పడినట్లు చర్చించుకుంటున్నారు.

  సల్మాన్, లులియా

  సల్మాన్, లులియా

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రొమేనియర్ మోడల్ లులియా వేంటర్‌తో డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ కోడై కూసింది. ఇద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడం వీరిపై అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది.

  గీతా బస్రా, హర్భజన్ సింగ్

  గీతా బస్రా, హర్భజన్ సింగ్

  మోడల్, నటి గీతా బస్రా....క్రికెటర్ హర్భజన్ సింగ్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పటి వరకు ఏమీ కాలేదు.

  అక్షయ్ కుమార్-ప్రియాంక

  అక్షయ్ కుమార్-ప్రియాంక

  ఆ మధ్య బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ ప్రియాంక చోప్రా మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లే అని తేలాయి.

  హృతిక్, బార్బరా

  హృతిక్, బార్బరా

  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్....హాలీవుడ్ నటి బార్బరా మోరీ కలిసి ‘కైట్స్' చిత్రంలో కలిసి నటించారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఎఫైర్ నడిచిందని, దీంతో హృతిక్ భార్య సుస్సానె హర్టయిందనే వార్తలు కూడా వినపడ్డాయి.

  షాహిద్-ప్రియాంక

  షాహిద్-ప్రియాంక

  బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్, హీరోయిన్ ప్రియాంక మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

  షాహిద్-విద్య

  షాహిద్-విద్య

  షాహిద్ కపూర్, విద్యా బాలన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినపడ్డాయి కానీ...ఆ తర్వాత అవన్నీ కల్పితమైన వార్తలే అని తేలింది. విద్యా బాలీవుడ్ బడా నిర్మాత సిద్ధార్థరాయ్‌ని పెళ్లాడింది.

  రాణి ముఖర్జీ-అభిషేక్

  రాణి ముఖర్జీ-అభిషేక్

  రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అభిషేక్ ఐశ్వర్యరాయ్‌ని పెళ్లాడాడు.

  English summary
  "We are just friends"- Isn't that so common to hear from most of the Bollywood stars? Indeed, it's nothing new to our ears. But, we believe that the Bollywood industry without romantic link-ups or break ups is like a desert without sand. Hence, there exists a lot of star secrets behind the silver screens, that hardly gets confirmed and always remain back as rumours or scandals amongst the gossipmongers.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more