»   » బాహుబలి నుండి విరామం, జూన్‌లో రానా మరో సినిమా

బాహుబలి నుండి విరామం, జూన్‌లో రానా మరో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు రానా గత కొంతకాలంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రాణా షూటింగ్ పార్టు పూర్తి కావడంతో మరో షెడ్యూల్ మొదలయ్యే వరకు విరామం తీసుకోబోతున్నట్లు రాణా ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరో షెడ్యూల్ మొదలయ్యే నాటికి కొన్ని నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది.

జూన్ నెలలో మరో కొత్త సినిమా ప్రారంభించబోతున్నట్లు తెలిపిన రానా...త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. రానా 'బాహుబలి' చిత్రంతో పాటు గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Starting another film mid-June: Rana

బాహుబలి సినిమా విషయానికొస్తే....ప్రభాస్, రానా, అనుష్క ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రానా నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. అడవి శేష్... రానా కుమారుడి పాత్రలో కనిపించబోతున్నాడట. రానాతో పాటు అడవి శేష్ కూడా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>And end of the schedule for <a href="https://twitter.com/search?q=%23Baahubali&src=hash">#Baahubali</a>. Off for a couple of months before I join the project again.</p>— Rana Daggubati (@RanaDaggubati) <a href="https://twitter.com/RanaDaggubati/statuses/463225804781285376">May 5, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చేయని విధంగా 'బాహుబలి' యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంతో పాటు దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది.

ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు 2015లో వచ్చే అవకాశం ఉంది.

English summary
"And end of the schedule for #Baahubali. Off for a couple of months before I join the project again. Starting another film mid-June details shortly." Rana tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu