ఉదయాన్నే లేవాలి..మళ్ళీ యోగా,జిమ్ మొదలు: రామ్ చరణ్
రిలాక్స్ గా శెలవలు గడిపి ఇండియా వచ్చేసాను...మెరుపు కోసం రెడీ అయ్యాను. రెగ్యులర్ నా యోగా, జిమ్ లకు వారం గ్యాప్ వచ్చింది. ఉదయాన్నే 5.30కి లేవాలి అంటూ రామ్ చరణ్ క్రిందటి రాత్రి ట్వీట్ చేసారు. ఆరెంజ్ విడుదల అనంతరం ఆయన శెలవలకు అండమాన్ వెళ్ళారు. ఇక మెరుపు విషయానికి వస్తే...ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపిస్తారు. అతనికి కోచ్ ఇచ్చే వ్యక్తి పాత్రకు కూడా తగినంత ప్రాధాన్యత ఉంది. అందుకే నానాపటేకర్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే నానాపటేకర్ ఒప్పుకోకపోతే యాక్షన్ కింగ్ అర్జున్ ని ఆప్షన్ గా పెట్టుకున్నారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ధరణి డైరక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు చిరంజీవి విజేత చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ పాత్రను పోషించారు. తండ్రి బాటలోనే నడుస్తూ విజయాలు సాధిద్దామని రామ్ చరణ్ తలపోస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. ఇక ఇంతకుముందు ధరణి..పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బంగారం అనే చిత్రం విడుదలైంది. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











