twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాపై స్టే...ఊపరి పీల్చుకున్న నిత్యానంద స్వామి

    By Srikanya
    |

    నిత్యానందపై రోజుకో సినిమా మొదలై ఆయనకు కొత్త తలనొప్పిని పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కన్నడంలో మదన్ పటేల్ అనే దర్శక,నిర్మాత సత్యానంద అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తానని ప్రకటించి తీసి ఆడియో పంక్షన్ సైతం చేసేసారు. త్వరలో ఈ చిత్రం విడుదల అని తేదీ ప్రకటించారు. దాంతో కంగారు పుట్టిన నిత్యానంద కోర్టుని ఆశ్రయించారు. దాంతో సత్యానంద సినిమా విడుదల నిలిపి వేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నటుడు, నిర్మాత, దర్శకుడు, బీజేపీ నాయకుడు మదన్‌పటేల్ స్వీయ దర్శకత్వంలో సత్యానంద సినిమా నిర్మిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కెమెరామన్‌గా పని చేస్తున్న రవిచేతన్ హీరోగా ఇందులో నటించారు. ఇప్పటికే ఆడియో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని బిడిది ధ్యానపీఠం స్వామిజీ నిత్యానంద స్థానిక సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం అర్జీ విచారణ జరిగింది. వాదనలు విన్న తరువాత సత్యానంద విడుదల నిలిపి వేయాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తన జీవిత చరిత్ర ఆధారంగా సత్యానంద సినిమా తీస్తున్నారని, దీంతో తనభక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని నిత్యానంద కోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదల కాకుండ స్టే ఇవ్వడంతో నిత్యానంద, ఆయన భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా దీనిపై హైకోర్టును మదన్‌పటేల్ ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహితులు, సినీ వర్గాలు పేర్కొన్నాయి.

    ఇక నిర్మాత మీడియాతో మాట్లాడుతూ...తమ చిత్రంలో నిత్యానంద నిజ జీవితంలో సంఘటనల, రజితతో రాసలీలలు అన్నీ ఉంటాయని ప్రజలకు నిజం తెలియాలనే ఆలోచనలతోనే ఈ చిత్రం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతోపాటు పలు భాషల్లోకి అనువదించనున్నట్లు తెలిపారు. అంతేగాక నిత్యానంద స్వామి పోలికలు ఉన్న ఒక యువకుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. నటి రంజిత తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని చెప్పడాన్ని మదన్ పటేల్ ఖండించారు. అదే నిజమైతే సత్యానంద చిత్రంలో నటించడానికి ముందుకు రావాలని సవాల్ విసిరారు. అలాగే మదన్‌పటేల్ ..ప్రత్యేకంగా రజిత విషయాన్ని ప్రస్దావించారు. కొద్ది రోజుల క్రితం రంజిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను నిత్యానందతో రాసలీలలు సాగించలేదని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మీడియా సమావేశం జరిగిన తర్వాత రోజే నిత్యానంద ఆశ్రమానికి రంజిత వెళ్లి పాదపూజ నిర్వహించడం నిజం కాదా.. అని ప్రశ్నించారు. నిత్యానంద వల్ల వేధింపులకు గురైనవారు, మోసపోయిన వారు తనకు వివరాలు వెల్లడించాలని.. వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతానని చెప్పారు. సత్యానంద సినిమా పోస్టర్లలో నిత్యానంద ఫొటోను తాను ఉపయోగించుకోలేదన్నారు. అలాగే తెలుగులో రాజేంద్రప్రసాద్ కూడా నిత్యానంద గెటప్ వేస్తున్నారు. వీటితో పాటు ఇదే పాయింట్ తో తమిళంలోనూ ఓ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.

    English summary
    Acknowledging Nityananda's plea, the High Court grants stay on releasing of the movie Swami Satyananda, summons filmmaker.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X