మిస్ బిహేవ్ చేసినందుకు కాదు కానీ..కిమ్ శర్మ
మగధీర చిత్రంలో ఐటం సాంగ్ చేసిన కిమ్ శర్మకు ఈ మధ్య పూనెలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన స్నేహితురాలుతో కలిసి మార్కెట్ లో నడుస్తూండగా..ఓ వ్యక్తి దూసుకు వచ్చి ఆమె స్నేహితురాలను డ్యాష్ ఇచ్చి..ఆమెతో మిస్ బిహేవ్ చేయటం ప్రారంభిచాడు. జనం మధ్యలో గొడవ ఎందుకుని ఆమె స్నేహితురాలు మాట్లాడకుండా ఊరుకుంది. కానీ కిమ్ శర్మ మాత్రం రెచ్చిపోయింది. వెంటనే ఆ కుర్రాడు చొక్కా పట్టుకుని చెంప పగలకొట్టింది. ఈ లోగా అక్కడో గుంపు పోగయింది. వారంతా చితకబాదారు. ఫైనల్ గా ఆ కుర్రాడు సారి చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో మూగిన జనం డిస్పర్స్ అవుతూ..కత్తి లాంటి కిమ్ శర్మ ఉండగా ప్రక్కన ఉన్న అమ్మాయి వెనక పడటమేమిటి అని అందరూ కామెంట్ చేసుకుంటున్నారు. అది విన్న కిమ్ శర్మ షాక్ అయ్యింది. ఈ విషయాన్నే మీడియాతో చెపుతూ..ఆ కుర్రాడు మిస్ బిహేవ్ కన్నా ఆ కామెంట్స్ తనని ఎక్కువ బాధించాయని వాపోయింది.
కిమ్ శర్మ ఖడ్గం ఐటం సాంగ్ మిస్ బిహేవ్ పూనె మగధీర రాజమౌళి kim sharma khadgam magadheera item song mis behave pune


Click it and Unblock the Notifications