చరణ్-ఉపాసన కూతురు నర్సరీ.. వాట్ ఏ ప్లానింగ్!.. ఫారెస్ట్ థీమ్‌తో ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?
మెగాస్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు ఇటీవలే ఓ పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లీంకార అని నామకరణం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ పాప కోసం ఓ స్పెషల్ నర్సరీని తీర్చిదిద్దుతున్నట్లు ఉపాసన ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి 2012 జూన్ 24న గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత పెళ్లైన 11 ఏళ్ళకు ఈ జంటకు ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. రీసెంట్ గా ఆ మెగా వారసురాలి బారసాల కూడా ఘనంగా చేశారు. ఈ వేడుకకు మెగా కుటుంబంతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరై పాపను ఆశ్వీర్వదించారు. పాపకు క్లీంకార అని నామకరణం చేశారు.

అన్నీ సౌకర్యాలతో ముందస్తుగా: సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిన విషయమే. ఇక తమ పిల్లల కోసం కావాల్సిన ప్రతి ఒక్కటినీ అందుబాటులో ఉంచుతారు. అన్నీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అలానే రామ్ చరణ్ ఉపాసన కూడా తమ పాప కోసం ముందునుంచే అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కావాల్సిన అన్నింటినీ ముందుగానే అందుబాటులో ఉంచుతున్నారు. అమె కోసం ఓ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

ఫారెస్ట్ థీమ్ తో: ఈ క్రమంలోనే పాప క్లీంకార కోసం రామ్ చరణ్ - ఉపాసన ఓ స్పెషల్ నర్సరీ రూమ్ ను తయారు చేయించారు. ఫారెస్ట్ థీమ్ తో ఈ నర్సరీని రూపొందించినట్లు తెలిపారు ఉపాసన. ఓ స్పెషల్ డిజైనర్ చేత ఇదంతా ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. ఉపాసన ఈ మధ్యనే తల్లి అయిన నేపథ్యంలో ఆమెకు ప్రశాంతత చేకూరేలా దృష్టిలో ఉంచుకుని ఈ నర్సరీ గదిని రూపొందించాం. అలాగే ఈ నర్సరీ.. అడవులపై రామ్-ఉపాసనలకు ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. పాప వాటిని చూడగానే ప్రేమించగలిగేలా ఈ గదిలో ప్రతీదాన్ని ఏర్పాటు చేశాం అని నర్సరీ డిజైనర్ పేర్కొన్నారు.
గదిలో ఏం ఉన్నాయంటే: ఇంకా ఈ నర్సరీ గదిలో ఏం ఉన్నాయో పూర్తిగా చూపించారు. పిల్లలు ఆడుకునే బేబీ షీప్, పెంగ్విన్, కుందేలు, ఏనుగు వంటి బొమ్మలతో రూమ్ లోని షెల్ఫ్ లను నింపారు. గోడకు అద్భుతమైన వాల్ పేపర్స్ ను ఏర్పాటు చేశారు. దీన్ని ఫారెస్ట్ థీమ్ తో రూపొందించారు.
జింకలు, ఏనుగులు వంటి జంతువులతో పాటు కొబ్బరి చెట్టు, పూల మొక్కలు వంటివి ఆ వాల్ పేపర్స్ పై డిజైన్ చేశారు. ఓ అడవిని తలపించేలా దానిని తయారు చేయించారు. సోఫాస్, కర్టెయిన్స్ ఇంకా పలు సామాగ్రీని గదిలో పొందుపరిచారు. మొత్తంగా ట్రాన్స్ పరెంట్ కలర్ తో ఉన్న ఈ నర్సరీ రూమ్ ఎంతో కూల్ గా, అందంగా ఆకర్షణీయనంగా తీర్చిదిద్దారు.

బ్యాక్ టు వర్క్: ఇకపోతే పాప పుట్టడంతో కొన్నిరోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తిరిగి షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు గ్రాండ్ గా రానుంది. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











