ప్రముఖ నటి హఠాన్మరణం, విషాదంలో సినీ సెలబ్రిటీలు

స్టార్ ట్రెక్, డియర్ గాడ్ లాంటి హాలీవుడ్ సినిమాలతో పాటు... నాష్ బ్రిడ్జెస్, డాక్టర్ క్విన్ మెడిసిన్, డయాగ్నసిస్ మర్డర్ లాంటి టెలివిజన్ సిరీస్‌లో నటించిన హాలీవుడ్ యాక్టర్ స్టెఫానీ నిజ్‌నిక్ హఠాన్మరణం చెందారు. జూన్ 23న ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే 54 ఏళ్ల ఈ నటి ఎలా మరణించింది అనే విషయమై క్లారిటీ లేదు.

స్టెపానీ నిజ్‌నిక్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. తన స్టెప్‌ఫాదర్, సోదరుడు, సిస్టర్ ఇన్‌లా, మేనల్లుడు, మేనకోడలితో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటోంది. స్టెఫానీ తన పెంపుడు కుక్కలు న్యూక్లెస్, జేక్‌తో ఎక్కవ సమయం గడుపుతుండేవారట. ఆమె మరణం పట్ల పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

Stephanie Niznik passed away

స్టెఫానీ నిజ్‌నిక్ అమెరికాలోని బంగూర్, మైనేలో జన్మించారు. 'ఎగ్జిట్ టు ఈడెన్' అనే సినిమా ద్వారా ఆమె తన నట ప్రస్థానం మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో టీవీ రంగంలో అవకాశాలు రావడంతో ఈ రంగంలోనే స్థిరపడ్డారు. కెరర్లో ఆమె 35కు పైగా టీవీ సిరీస్‌లో నటించారు.

2002 నుంచి 2006 వరకు ప్రసారమైన 'ఎవర్‌వుడ్' అనే టీవీ సీరిస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో స్టెపానీ... నీనా అనే పాత్రలో నటించారు. తన ఇంటి పక్కన ఉండే ఆండీ బ్రౌన్ సింగిల్ ఫాదర్‌గా పిల్లలను పెంచడంలో స్ట్రగుల్ అవుతుంటే నీనా సహాయం చేస్తోంది. స్టెఫానీ నిజ్‌నిక్ మరణం పట్ల 'ఎవర్‌వుడ్' టీమ్ సంతాపం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X