ముస్లింలు అంటే టెర్రిరిస్టులేనా?షా సూటి ప్రశ్న!

By Staff

Naseeruddin Shah
ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో ముస్లింలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నారని.. దీని వల్ల సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం సంపాదించుకోవటం కోసం మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించడం దురదృష్టకరమైన పరిణామంగా ఆయన అభిప్రాయపడ్డారు.ఆయన తాజా చిత్రం షూట్ ఆన్ సైట్ ప్రమేషన్ సందర్భంగా ముంబయి లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో పలు విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వెళ్ళడించారు.

అయితే ఇలా జరగటం ఒక్క బాలీవుడ్ చిత్రాల్లోనే కాదని.. హాలీవుడ్ చిత్రాల్లోను కనపడుతోందని షా వెల్లడించారు. అక్కడా అరబ్ కంట్రీ వారిని విలన్స్ గా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇక ఇలాంటి అంశాలను చిత్రాల ద్వారానే ఎదుర్కోవాలని సూచించారు. 'షూట్ అండ్ సైట్', 'ఖుదా కే లియే' వంటి చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణలుగా తెలిపారు. 2005లో జరిగిన లండన్ పేలుళ్ల సంఘటనను నేపథ్యంగా తీసుకుని బ్రిటన్‌లో ఉంటున్న భారతీయ దర్శకుడు జగ్మోహన్ ముంద్రా షూట్ సైట్ చిత్రాన్ని నిర్మించారు.

సున్నిత స్వభావం గల ముస్లింల మనోభావాలకు దగ్గరగా రూపొందిన ఈ చిత్రంలో షా ఓ ముస్లిం అధికారి పాత్రను చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఎంచుకునే పాత్రల ద్వారా కూడా తన భావాలను వ్యక్తపరుస్తానని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా గురించి చెబుతూ ఇది ఓ ఎగ్జైటింగ్ ధ్రిల్లర్ అనీ తన పాత్ర ఓ ఆధునికి ముస్లిమ్ వ్యూ పాయింట్ ని వెళ్ళడిస్తుందనీ షా చెప్పారు.ఇదే చిత్రంలో పాక్‌కు చెందిన ఓ ముస్లిం.. ఉగ్రవాదిగా మారి ఎంత రాక్షస ప్రవర్తన కలిగి ఉంటాడో కూడా తెరకెక్కించినట్లుగా షా వ్యాఖ్యానించారు.ఈ చిత్రం ద్వారా ముస్లింలలో సున్నిత స్వభావులకు, మతమూఢంలో మునిగిపోయిన వ్యక్తికి మధ్య తేడాను చూపించారని షా తెలిపారు. తాను ప్రస్తుతం అభిషేక్ చౌబే దర్వకత్వంలో రూపొందుతున్న ఇష్కియా చిత్రంలో నటిస్తున్నట్లు షా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X