twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఆవేదన

    By Srikanya
    |

    ముంబై: ''ప్రపంచ సినిమాతో భారతీయ సినిమా పోటీ పడుతోంది. ఇక్కడి అభివృద్ధిని నేను కళ్లారా చూశా. అమెరికా-భారత్‌ల మధ్య సంస్కృతిక వారధి వేయాల్సిన బాధ్యత కూడా సినిమా రంగంపైనే ఉంది. ప్రపంచ సినిమాని అమెరికా సోదరులు వీక్షించలేకపోతున్నారు. బుల్లితెరలో మిగతా దేశాల సినిమాలు ప్రసారం కావడం లేదు. దానికి కొన్ని వ్యాపార కారణాలు అడ్డుపడుతున్నాయి'' అని స్పీల్‌బర్గ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

    ప్రఖ్యాత హలీవుడ్‌ దర్శకుడు రూపొందించిన 'లింకన్‌' చిత్రం ఆస్కార్‌ పురస్కారాలు అందుకొంది. ఈ చిత్రాన్ని అనిల్‌ అంబానీతో కలిసి స్పీల్‌బర్గ్‌ నిర్మించారు. ఆస్కార్‌ ఆనందాన్ని భారతీయ చిత్రపరిశ్రమతో పంచుకోవడానికి స్పీల్‌బర్గ్‌ ముంబై వచ్చారు. ఈ సందర్భంగా అరవై మంది ప్రత్యేక ఆహ్వానితుతో సమావేశమయ్యారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ స్పీల్‌బర్గ్‌ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. 'మేం ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం...' అని అబితాబ్‌ చెప్పారు.

    దానికి సమాధానంగా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ''లేదు. అది మీరు చేయాల్సిన పని కాదు. మా బాధ్యత. ఈ విషయంపై మా దేశంలో ప్రచారం చేస్తా'' అని స్పీల్‌బర్గ్‌ మాటిచ్చారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ దర్శక దిగ్గజాలతోపాటు, ప్రముఖ నటులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. 'సోషల్‌ నెట్‌వర్కింగ్‌ల వల్ల ప్రపంచం చిన్నదైపోయింది. ఇక సృజనాత్మకతను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదు''అన్నారు.

    ఇక 'షిండ్లర్స్‌ లిస్ట్‌', 'సేవింగ్‌ ప్రైవేట్‌ర్యాన్‌', 'ఈటీ', 'జాస్‌', 'జురాసిక్‌ పార్క్‌'... లాంటి చిత్రాలను తలచుకోగానే గుర్తొచ్చే స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లింకన్‌'. యూఎస్‌లో బానిసత్వాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో పదమూడో చట్ట సవరణ చేసేందుకు లింకన్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కింది. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, కాథలీన్‌ కెన్నడీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకోవడంతో కలిపి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌కి ఇది పదిహేనో ఆస్కార్‌ నామినేషన్‌.

    English summary
    Amitabh Bachchan met the world acclaimed Hollywood filmmaker Steven Spielberg last evening at Taj Lands End, Bandra, Mumbai.. Spielberg is in the country to celebrate the success of his Oscar-winning film Lincoln, co-produced by Dream Works (His own production house) and Anil Ambani's Reliance Entertainment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X