స్పీల్‌బర్గ్ నన్ను మెచ్చుకున్నారు: ప్రకాష్ రాజ్
ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ... ''ఆ చిత్రం చూశాను అని చెప్పడమే కాదు... చిత్ర కథ గురించీ, నా నటన గురించీ చెప్పారు. 'కళ్లతోనే హావభావాలు పలికించారు. క్లిష్టమైన భావోద్వేగాల్ని చూపించిన తీరు బాగుంద'న్నారు. ఓ నటుడిగా నాకు చాలా సంతోషకరమైన క్షణాలవి. నేను స్పీల్‌బర్గ్ ప్రశంసను అందుకొంటానని ఏ రోజూ వూహించలేదు'' అన్నారు.
ఇంకా మాట్లాడుతూ.... '' ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతోపాటు మరాఠీలోనూ నటిస్తున్నాను. ఇక తమిళంలో ఓ ఛానెల్ కోసం నీలంగళుమ్ వెల్లాలమ్ ఒరుకోడి అనే కార్యక్రమం చేస్తున్నాను. దీని ద్వారా భిన్న వర్గాలకు చెందినవాళ్లను కలుసుకొని, సామాజిక పరిస్థితులు, వారి ఆలోచనలను తెలుసుకొనే వీలు కలుగుతోంది''అన్నారు.
ఇటీవల స్టీవెన్ స్పీల్‌బర్గ్ మన దేశం వచ్చారు. ఆ సమయంలో అనిల్ అంబానీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన చిత్ర ప్రముఖులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంలో స్పీల్‌బర్గ్‌కి ప్రకాష్‌రాజ్‌ని పరిచయం చేసినప్పుడు 'కంజీవరం' చూశానని చెప్పారు. దీని గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించింది. ఇక మంగళవారం ప్రకాష్‌రాజ్ జన్మదినం. త్వరలో ఆయన తెలుగులో 'ఉలవచారు బిర్యానీ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.


Click it and Unblock the Notifications












