twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ ఆపేయండి..! రియాలిటీ షోపై రేగిన వివాదం, ఆందోళనలూ అరెస్టులూ

    నేతాజీ సుభాష్‌ షెనాయ్‌ సంస్థ అధ్యక్షుడు మహరాజన్‌ నేతృత్వంలో బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా ఆదివారం ఆందోళనలు జరిగాయి.

    |

    కమల్‌హాసన్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. విఖ్యాత నటుడు కమలహాసన్‌ హోస్ట్‌ చేస్తున్న ఈ కార్యక్రమంలో.. అందాల తార ఓవియా హెలెన్‌ ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు.. కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వర్తమాన రాజకీయాలపై కమలహాసన్‌ వరుస వ్యాఖ్యలు.. తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి.

    తాజాగా, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. హాట్ అండ్‌బ్యూటిఫుల్‌ స్టార్‌ ఓవియా ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలతో.. ఈ కార్యక్రమం మరోసారి వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో... పోలీసుల జోక్యంపైనా న్యూస్‌ స్ప్రెడ్‌ అయింది. దీంతో, బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌ కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఆ వివాదం అటు కొనసాగుతూందగానే మరో పక్క ఈ షో ని ఆపేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.

     Stop it immediately: controversy on Tamil Bigg Boss

    బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా ఆదివారం ఆందోళనలు జరిగాయి. నేతాజీ సుభాష్‌ షెనాయ్‌ సంస్థ అధ్యక్షుడు మహరాజన్‌ నేతృత్వంలో దాదాపు 40మంది ఆందోళనకారులు ఉదయం పూందమల్లిలోని బిగ్‌బాస్‌ స్టూడియో వద్దకు చేరుకున్నారు. షోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు సంప్రదాయాలను మంటగలిపేలా షో నిర్వహణ ఉందని, వెంటనే నిలిపివేయాలన్నారు.

    లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి సమీపంలోని కల్యాణమండపానికి తరలించారు. ఈ సందర్భంగా మహరాజన్‌ మాట్లాడుతూ... ఇటీవల షోలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. వారంలోపు నిలిపేయకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ షోను నిలిపేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

    English summary
    PIL has been filed to stop popular Tamil reality show Bigg Boss in Madras High Court.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X