twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

    By Pratap
    |

    హైదరాబాద్ ‌: సమగ్ర కుటంబ సర్వే జరిగిన రోజు తాను ఇంట్లో లేనని సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా పాల్గొనాలన్నందునే తాను సర్వేలో పాల్గొనలేదని తెలిపారు.నేతలు ఇకనైనా ద్వేషం వెళ్లగక్కకుండా ఉంటే మంచిదన్నారు. ఇద్దరు సీఎంలు రెండు నెలల క్రితమే చర్చలు జరిపితే సమస్యలు తీరేవన్నారు. కేసీఆర్‌ దక్షతగల నాయకుడిగా పాలన కొనసాగించాలన్నారు.

    అమిత్‌షాతో జనసేన దళపతి, సినీ హీరో పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చి... బేగంపేటలోని టూరిజం హోటల్‌లో బస చేసిన అమిత్‌ షాను రాత్రి 10.45 గంటల ప్రాంతంలో పవన్‌ కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ పవన్‌ కల్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ, టీడీపీ భావిస్తున్నాయి.

    Pawan - KCR

    ఇక పవన్ కళ్యాణ్ సమగ్ర సర్వేలో పాల్గొనక పోవడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదని ఓ విలేకరి ప్రస్తావించినప్పుడు... పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని, కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మ అన్నారు. ప్రభుత్వ సర్వేలో పాల్గొనక పోవడం సామాజిక నేరమని వ్యాఖ్యానించారు.

    అలాగే ఎన్నికల సమయంలోనే పవన్ కళ్యాణ్ నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సమయం వచ్చినప్పుడల్లా ఆయనపై పైన ఎగిరిపడ్డారు. తెలంగాణలో తెరాస గెలిచిన తర్వాత పవన్ స్పందిస్తూ.. ఇప్పటికైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఇప్పుడూ అదే మళ్లీ చెప్పారు.

    ఎన్నికల ప్రచారం సమయంలో తెలంగాణలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. తెరాస పైన, కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. కేసీఆర్ కూడా ధీటుగా స్పందించారు. గాలికి కొట్టుకుపోతాడంటూ పవన్‌ను హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇరువురు పరస్పరం ఘాటైన విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు సర్వేలో పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం చర్చనీయాంశమైంది.

    English summary
    Pawan Kalyan made a statement saying, “ KCR should stop proactive statements and concentrate on people of Telangana"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X