'రక్త చరిత్ర-2' లో వైయస్ ని చెడుగా చిత్రీకరించారు...ఆపాలి
ఈ రోజు విడుదల అవుతున్న రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం రక్త చరిత్ర-2 చిత్రాన్ని ఆపుచేయాలంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ కొండారెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలను చిత్రీకరించారని, ఇరువర్గాల మధ్య ఉద్రేకాలను పెంచుతూ హింసకు దారితీసేవిగా ఉంటాయని, కనుక దీనిని విడుదల చేయకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రక్తచరిత్ర తొలి భాగంలో ఎన్టీయార్ పాత్ర ఉందని, రెండో భాగంలో వైఎస్‌ఆర్ పాత్ర ఉందని, దీనివల్ల గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. రక్తచరిత్ర-2లో దివంగత వైఎస్ గురించి చెడుగా చిత్రీకరించారని, ఇది తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తచరిత్రలో ఎన్టీఆర్ గురించి ఇలాగే చిత్రీకరించగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని చెప్పారు. ఇందులో ప్రతివాదులుగా డీజీపీ, ముంబయి, హైదరాబాద్ సీబీఎఫ్‌సీలు, నిర్మాత కళ్యాణ్‌లను పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











