twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివ్యూల ఆపండి అంటూ 'నిర్మాతల మండలి' ప్రకటన

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా రివ్యూలపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోప్పడింది. మీడియా వాళ్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమా పరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల అవ్వగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    మరోప్రక్క నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానెళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా ఏ ఛానెల్ తో అయినా ఒప్పందం కుదుర్చుకుని సినిమా ప్రచారం చేసుకోవచ్చని పేర్కొంది.

    Stop Reviews: Producers Council appeal Media!
    ‘సిండికేట్‌'లా మారిన కొందరు నిర్మాతల కార్యకలాపాలతోగానీ, పబ్లిసిటీ విషయాలతోగానీ తమకు సంబంధం లేదని తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. నిర్మాతల మండలిని కాదని కొందరు పెద్ద నిర్మాతలు ‘అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ తెలుగు ఎల్‌ఎల్‌పీ' (లిమిటెడ్‌ లయబులిటీ పార్ట్‌నర్‌షిప్‌)గా సిండికేట్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ స్పందించారు. గత కొద్ది రోజులుగా పరిశ్రమలో నెలకొన్న గందరగోళాన్ని ఇతర నిర్మాతలు, మీడియా పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు.

    English summary
    TFPC urged Print/Electronic Media and Websites to stop reviewing films as Producers were incurring huge losses because of this trend and it is eventually affecting the whole Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X