ఆ విజువల్స్ ఆపండి: హరికృష్ణ మరణంపై మీడియాకు మంచు మనోజ్ రిక్వెస్ట్
నందమూరి హరికృష్ణ మరణంపై నటుడు మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విని షాకయ్యానని, వారి కుటుంబానికి, అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. హరికృష్ణ అంకుల్ ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఒక రిక్వెస్ట్ చేశారు. యాక్సిడెంట్ దృశ్యాలను ప్రసారం చేయవద్దని కోరారు. ఆ విజువల్స్ టీవీలో పదే పదే చూపించడం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు మరింత బాధకు గురవుతున్నారని, దయచేసి వాటిని ప్రసారం చేయడం ఆపాలన్నారు.
హరికృష్ణ గారు మనందరికీ చెందిన వ్యక్తి... ఆయన పట్ల గౌరవం చూపాలని కోరుకుంటున్నాను. నా రిక్వెస్ట్‌ను మీడియా వారు పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ మనోజ్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా హరికృష్ణకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలను ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కాగా... హరికృష్ణ భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి ఆసుపత్రి నుండి హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకొస్తున్నారు. శుక్రవారం మొయినాబాద్‌లోని ఫాం హౌస్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి.


Click it and Unblock the Notifications











