ఆగిన 'బాద్‌షా' ...థియేటర్ ధ్వంసం
హైదరాబాద్ : 'బాద్‌షా' సినిమా మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు థియోటర్ లో నానా హంగామా చేసిన సంఘటన నిన్న ఉగాది రోజు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం శ్రీకృష్ణ థియేటర్‌లో 'బాద్‌షా' చిత్రప్రదర్శన జరుగుతోంది.
సాయంత్రం ఆరుగంటల ఆటకు చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చారు. ఇదే సమయంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో శాటిలైట్ సిగ్నల్స్ అందలేదు. ఇది అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో రెచ్చిపోయిన కొందరు దాడి చేసి థియేటర్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రేక్షకులకు టిక్కెట్ల డబ్బును తిరిగి ఇప్పించేయడంతో సమస్య సద్దుమనిగింది.
ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బాద్‌షా'. క్రింతం శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఓ రేంజి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే లెంగ్త్ ఎక్కువైందని టాక్ రావటడంతో సినిమాని ట్రిమ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సినిమా ప్రస్తుతం రెండు గంటల నలభై నిముషాలు ఉంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కు కత్తెర వేసి, దాన్ని మరింత షార్ప్ గా చేయాలని దర్శక,నిర్మాతలు భావించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ విషయమై అథికారిక ప్రకటన ఏదీ లేదు.


Click it and Unblock the Notifications











