»   » హాట్ టాపిక్: మహేష్ బాబు లైఫ్ స్టైల్! (ఫోటో ఫీచర్)

హాట్ టాపిక్: మహేష్ బాబు లైఫ్ స్టైల్! (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బ్రహ్మాండంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పారు కూడా. కెరీర్ బ్రహ్మాండంగా సాగుతుందంటే అదాయం కూడా అదే రేంజిలో ఉంటుంది. మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. తెలుగులో ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న ఇద్దరు హీరోల్లో ఆయన ఒకరు.

ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి 18 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్. ఇవి కాక రికార్డు స్థాయిలో వివిధ కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్నారు. ఈ లెక్క ప్రకారం ఆయన సంవత్సర ఆదాయం ఎన్ని కోట్లు ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు.

సినిమాల గ్యాపులో సంవత్సరానికి రెండు మూడు సార్లు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వేస్తుంటారు మహేష్. వివాదాలకు దూరంగా ఉంటారు. క్షమశిక్షణతో కూడిన జీవన విధానం అవలంభిస్తుంటారు. చిన్నతనం నుండి మహేష్ బాబు ఇంతే. అలా సంపాదన అంతా తన సొంతానికే వాడుకునే రకం కాదు. సేవా కార్యక్రమాలకు ఆయన భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నారు.

మహేష్ బాబుతో పాటు ఇతర హీరోలు కూడా ఇదే విధంగా లగ్జరీ లైఫ్ గడుపుతుండవచ్చేమో గానీ....టాలీవుడ్లో ఈ మధ్య లగ్జరీ లైఫ్ గడుపుతున్న హీరోగా బాగా ఎక్స్ ఫోజ్ అవుతుంది మాత్రం ఈ సూపర్ స్టారే. ఈ రేంజిలో సంపాదన ఉన్నప్పుడు ఆటో మేటిక్ గా వారి లైఫ్ లగ్జరీగా సాగుతుందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. స్లైడ్ షోలో మహేష్ బాబుకు సంబంధించిన లగ్జరీ వాహనాలు...

మహేష్ బాబు
  

మహేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడమే ఓ గొప్ప. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ దృష్ణ్యా సినిమా హిట్టయితే భారీ లాభాలు వస్తాయనేది నిర్మాతల ప్లాన్.

ఖరీదైన కార్లు
  

ఖరీదైన కార్లు

మహేష్ బాబు వద్ద రేంజ్ రోవర్‌తో పాటు, జాగ్వార్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి విలువ కోట్లలో ఉంటుంది.

ఖరీదైన కారావ్యాన్
  

ఖరీదైన కారావ్యాన్

మహేష్ బాబు షూటింగులకు వెళ్లినపుడు స్టే చేయడానికి కోట్లు ఖర్చు చేసి కారా వాన్ డిజైన్ చేయించారు.

అత్యాధునిక సౌకర్యాలు
  

అత్యాధునిక సౌకర్యాలు

మహేష్ బాబు కారావ్యాన్‌లో బెడ్రూంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

 

Please Wait while comments are loading...