twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండ బోల్డ్ ఫోటో వెనుక అసలు కధ ఇదే.. కొత్త రికార్డు బద్దలు కొట్టిన పోస్టర్ ?

    |

    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు నెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతుండగా సినిమా నుంచి ఒక న్యూడ్ పోస్టర్ విడుదల చేయడంతో సోషల్ మీడియా అంతా దాని గురించే చర్చ జరుగుతుంది. అయితే ఒక తెలుగు హీరో ఇంతలా ధైర్యం చేసి ఒక న్యూడ్ పోస్టర్ కి ఫోజులు ఎలా ఇచ్చారా అనే విషయం మీద జరుగుతుంది. అయితే ఈ పోస్టర్ వెనుక అసలు కారణం ఏమిటి? టీం ఎందుకు ఈ పోస్టర్ విడుదల చేసింది. అనే వివరాల లోకి వెళితే..

    హాట్ టాపిక్ గా

    హాట్ టాపిక్ గా


    వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పెట్టిన సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో కలిసి చేస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం చాలా రోజుల క్రితమే క్లారిటీ వచ్చింది. కానీ తాజాగా ఒంటి మీద ఏమాత్రం ఆచ్చాదన లేకుండా కేవలం చేతులకు గ్లౌజులు మాత్రమే వేసుకొని ఒక పూల బొకే మొలకు అడ్డం పెట్టుకున్న పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    గుండెలనిండా ధైర్యం

    గుండెలనిండా ధైర్యం


    సమంత, రష్మిక వందన, అనుష్క, తమన్నా వంటి వారు ఈ పోస్టర్ బాగుందంటూ కామెంట్లు చేస్తుంటే నేటిజెన్లు మాత్రం తమకు ఇష్టం వచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలంటే గుండెలనిండా ధైర్యం కావాలని అంటుంటే మరికొందరు మాత్రం ఇలాంటి ఫోజులు ఇచ్చి ఏమి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

     నూలు పోగు లేకుండా

    నూలు పోగు లేకుండా


    అయితే తాజాగా అసలు విజయ్ దేవరకొండ ఇలా నగ్నంగా ఫోటోకి ఫోజులు ఇవ్వాల్సి రావడానికి వెనక కారణం ఏమిటో వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఎంఎంఏ స్పోర్ట్ అనే ఒక ఫైట్ కి సంబంధించి ఫైటర్ గా కనిపిస్తున్నారు. ఈ ఎంఎంఏ స్పోర్ట్ జరిపే ప్రతి మ్యాచ్ ముందు ఇలాగే ప్రతి ఫైటర్ కూడా ఒంటి మీద నూలు పోగు లేకుండా నిర్వాహకులకు చూపించాల్సి ఉంటుంది.

     సరికొత్త రికార్డు

    సరికొత్త రికార్డు


    బాడీ కొలతలు వంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇలా బరువు సహా ప్రతి విషయాన్ని వారు ఖరారు చేసుకున్న తర్వాతే ఫైట్ చేసేందుకు అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఈ సినిమా మేకర్స్ విజయ్ దేవరకొండ అర్ధ నగ్న ఫోటోతో క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక మరోపక్క ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది.

    అద్భుతమైన స్పందన

    అద్భుతమైన స్పందన


    ఈ పోస్టర్ విడుదల చేసిన తర్వాత అత్యంత వేగంగా ఒక మిలియన్ లైక్స్ అందుకున్న సినిమా పోస్టర్ గా నిలిచింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే విజయ్ దేవరకొండ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోకి 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. సినిమా విడుదల ముందే పరిస్థితి ఇలా ఉందంటే విడుదలైన తర్వాత సినిమా అద్భుతమైన స్పందన అందుకోవటం ఖాయమని భావిస్తున్నారు.

    English summary
    Team Liger dropped a new poster today and Vijay Deverakonda is seen striking a dynamic pose in it. here is the Story behind Liger Vijay Deverakonda’s new poster .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X